నాటి బాలీవుడ్ ప్రేమ కధలు రూమర్లా? వాస్తవాలా?

నాటి బాలీవుడ్ ప్రేమ కధలు  రూమర్లా? వాస్తవాలా?
కమలహాసన్, సారిక ప్రేమలో పడ్డారు. సారిక గర్భవతి అయ్యింది. అయ్యితే కమల్ ఆమెను ప్రేమించాడే కానీ పెళ్ళాడలేదు. అప్పటికే కమల్ కు  వానితో పెళ్లి అయ్యింది. సారికతో భర్తకు ఏర్పడిన ప్రేమ బంధం వణికి తెలిసిపోయింది. ఆ విషయం విన్న సారిక, వాణి మనోవ్యధ, దుఃఖాన్ని లక్ష్య పెట్టలేదు. కమల్ తో ఆమె ప్రేమకు ప్రతిఫలంగా సారిక బిడ్డను కన్నది. అయితే, కమల్ మాత్రం సారిక ప్రేమకు కట్టుబడలేదు. సారికను వదిలేసాడు.

సైరాబాను, దిలీప్ కుమార్  చూడ చక్కని జంటగా పేరు పొందారు. కానీ, ఆ తరువాత హైదరాబాద్ కి చెందిన ఆస్మా అనే స్త్రీని దిలీప్ కుమార్ వివాహమాడారు. తమ వివాహాన్ని కొన్ని నెలల వరకే గోప్యముగా ఉంచగలిగారు. తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే వార్త సైరాబానుకి చేరింది. ఆమె తన భర్తను, ఆస్మా నుంచి తలాఖ్ తీసుకోమని గట్టిగా  కోరింది. ఆస్మా ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దిలీప్ కుమార్ ని పెళ్లాడక ముందే ఆస్మా వివాహిత. ఆమె తన పిల్లల ఇద్దరిని దిలీప్ కుమార్ వద్దకు చేర్చాలని తలచింది. దిలీప్ కుమార్ సైరాబాను తోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆటను ఆస్మా నుంచి విడాకులు తీసుకున్నాడు . ఆస్మా తన బిడ్డలవద్దకు తిరిగి వెళ్లి పోయింది.

ఒకానొకప్పుడు అజయదేవగన్, కరిష్మా ఒకరినొకరు ప్రేమించుకోవటమే కాక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ విధి రాత మరో విధముగా మారింది. ఒకసారి ఔట్డోర్ షూటింగ్ లో పాల్గొనటానికి అజయ్ వెళ్ళినప్పుడు, కరిస్మా ఆటను వుండే గదికి ఫోన్ చేసింది. అజయ్ కి బదులుగా ఆమె ఫోన్ కాళ్ళకి సమాధానముగా ఓ నటి మాట్లాడింది.

కరిష్మా ఆ విషయానికి అజయ్ మీద తీవ్రముగా మండి పడింది.  అజయ్ ఆమెకు నచ్చ చెప్పాలని ఎంతగా ప్రయత్నింఇచ్చిన సాధ్యం అవ్వలేదు. అతనితో ప్రేమను, అనుబంధాన్ని తెగ తెంపులు చేసుకొన్నది.

ఆమె నిష్క్రమణతో కాజోల్ అజయ్ మనస్సులోకి, జీవితములోకి ప్రవేశించింది. కాజోల్ తన బాయ్ ఫ్రెండ్ కార్తీక్ స్నేహానికి స్వస్తి చెప్పింది. ఆ తరువాత కరిష్మా అజయ్ దేవగన్ కి దగ్గరవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవి విఫలమవటమే కాక, కాజోల్ – అజయ్ దగ్గరయ్యారు.– by navarasalu.com team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *