తెర వెనక హీరోలు

కొరియో గ్రాఫర్లు :-  అక్కినేని నాగేశ్వరరావు సొగసైన  స్టెప్పులకు, చిరంజీవి మాస్ డాన్స్ కు మంత్ర ముగ్దులు కాని ప్రేక్షకుడు ఉండడు. చిరంజీవి మెగాస్టార్  గా  ఎదగటానికి  డాన్సులు  ప్రధాన కారణమని అందరికి తెలిసిందే.
గతంలో వెంపటి చిన సత్యం  తర్వాత సలీమ్ మాస్టర్, తార,  శివ సుబ్రహ్మణ్యం,  సుందరం మాస్టర్,  ప్రభుదేవా,  లారెన్స్,  రాజు సుందరం,  జానీ మాస్టర్  తదితర  నృత్య  దర్శకులు  తారలతో  ఆడి  పాడించారు.
కేవలం  డాన్సుల  తోనే  హిట్  అయిన  చిత్రాలు  కోకొల్లలు.   నృత్య  దర్శకుడు  సందర్భం,  సాహిత్యం,   సంగీతానికి  అనుగుణంగా   డాన్స్  కంపోజ్  చేస్తాడు.   కెమెరా  ముందు  హీరో హీరోయిన్లు   ఆడితే,   కెమెరా  వెనక  నృత్య   దర్శకుడు  డాన్స్  చేస్తాడు.   వీరి  కింద  అసిస్టెంట్   కొరియో  గ్రాఫర్లు ,   డాన్సర్లు  వుంటారు.  

జూనియర్ ఆర్టిస్టులు :- కాలేజీ  క్లాస్   రూమ్, పెళ్లి  వేడుకలు,  షాపింగ్  మాల్,  మార్కెట్,  రైల్వే  స్టేషన్,  బస్  స్టాండ్  తదితర  సన్నివేశాలలో  తెరపై   చాలా  మంది  కనిపిస్తుంటారు.   వీళ్లంతా  జూనియర్  ఆర్టిస్టులు.   వీరికి  డైలాగ్స్  వుండవు.  కేవలం  ఫ్రేమ్  లో   కనిపిస్తారంతే. జూనియర్  ఆర్టిస్ట్  ఏజెంట్   చిత్ర  కథానుసారం  కావాల్సిన  చిన్న పిల్లలు,   యువతి  యువకులు,  వృద్దులు   తదితరులను   సమ కూరుస్తాడు.   వీరికి   అంతగా  ప్రాధాన్యత  ఉండదు.  సన్నివేశానికి తగట్టు   ఫ్రేమ్  లో  కన్పిస్తారు.  

జూనియర్  ఆర్టిస్ట్  ఏజెంట్లు :-
  వీరు  కోఆర్డినేటర్లు  గా  సినీ  టైటిల్స్ లో   సుపరిచితం.   వీరు  ప్రొడక్షన్  మేనేజర్  కోరికపై   ఏ వయసు  వాళ్ళు  ఎంత  మంది  కావాలో   అంతమంది  జూనియర్   ఆర్టిస్టులను   సకాలంలో  లొకేషన్కు  చేరుస్తారు.   ప్రొడక్షన్  వాళ్లే  వీరికి  ప్రయాణ,  భోజన  వసతులు  సమకూరుస్తారు.   షూటింగ్  అయ్యాక   జూనియర్   ఆర్టిస్టులను ఇంటి  దగ్గర  దింపే  భాద్యత  వీరిది.

ప్రొడక్షన్  ఎగ్జిక్యూటివ్ లు :-  ఆర్టిస్టుల  మేకప్  నుంచి   షూటింగ్  ప్యాకప్  వరకు  అన్ని  చూసుకునే  బాధ్యత  వీరిదే.  అవుట్  డోర్  లొకేషన్ల  పర్మిషన్  తీసుకోవటం,  హీరో,   హీరోయిన్లకు   అన్ని రకాల  సౌకర్యాలు,   వసతులు   కల్పించటం  వీరి  పని.  
ప్రొడక్షన్  ఎగ్జిక్యూటివ్ లు   నిర్మాతకు  కళ్ళు చెవులుగా పని  చేస్తారు.   సినిమ నిర్మా ఖర్చు  పెరగాలన్నా,  తగ్గాలన్నా  అది  వీరి  చేతిలో  పని.  

సినీ ఆర్టిస్టులు :-  ముందుగా  దర్శకుడు  కథానుసారం  ప్రధానమైన   హీరో,  హీరోయిన్,  ఇతర  క్యారెక్టర్  ఆర్టిస్టులను  ఎంపిక  చేసుకుంటాడు.  ఆపై  సినీ  ఆర్టిస్టులు  అని  పిలవబడే  కంపెనీ  ఆర్టిస్టుల  ఎంపిక   జరుగుతుంది.  వీరు  రెండు  మూడు సీన్  లలో, ఒకటి  రెండు  డైలాగ్స్  తో  తెర పై  కన్పిస్తారు.  

ప్రొడక్షన్ అసిస్టెంట్లు :-   వీళ్ళు   షూటింగ్  స్పాట్  లో  ఉన్న   అందరికి  అల్పాహారం,   బోజనాలు,  టీ,  కాఫీ  లు  సమకూరుస్తారు.  ప్రొడక్షన్  మేనేజర్   ఇచ్చిన  జాబితా  ప్రకారం వివిధ  రకాల  వంటలను  ఆర్డర్  చేసి  సకాలంలో  సెట్ కు  తెస్తారు.   సెట్  అసిస్టెంట్లు  కూడా   ఈ  పనులు  చేస్తూనే ,  షూటింగ్ కు  అవసరమైన  సెట్స్  ను  లొకేషన్  కు  చేరుస్తారు.  ఒక  విధంగా  వీరంతా  లోకేషన్లలో  కార్మికులు.  

స్టూడియో వర్కర్లు :-  ఆర్ట్  డైరెక్టర్ల  పర్యవేక్షణలో  స్టూడియో  వర్కర్లు   పని  చేస్తారు.  వీరు సెట్  నిర్మించటానికి చెక్క  పని,  పెయింటింగ్,   కరెంటు  తదితర  పనులు  చేస్తారు.  

అవుట్  డోర్  లైట్  మెన్:-
  వీరు  బహిరంగ  ప్రదేశాలలో  చిత్రికరణకు  అనువుగా   కెమెరా  కు  సరిపడేంతగా   లైట్లు  ఇతర. పరికరాలు    అమర్చుతారు.  చాలా  మందితో , ఎన్నో  మెషిన్లతో  ఈ  పనులు  చేస్తారు.   లైటింగ్  అమరిక  సరిగ్గా  లేక  పొతే  చిత్రీకరణ  నాసిరకంగా  వుండే  ప్రమాదం  వుంది.  

అవుట్  డోర్  యూనిట్  టెక్నిషేయన్లు:–  స్టూడియో  బైట  షూటింగ్   జరిపేటప్పుడు  కావలసిన  ఎలెక్ట్రిషన్లు,   కెమెరా  అసిస్టెంట్లు ,   సెక్యూరిటీ  సిబ్బంది  ఈ  కోవ  లోకి  వస్తారు.   కెమెరా  అసిస్టెంట్లు   కెమెరా  మెన్  ఆదేశాలు  పాటిస్తారు.   చిత్రీకరణ  పూర్తయ్యాక   తిరిగి  కెమెరాను  స్టూడియోకు చేర్చే బాధ్యత  వీరిదే.   అలాగే  ఎలెక్ట్రిషన్లు  సెట్  లోని  జెనరేటర్లు  నిరంతరాయంగా   పని  చేసేటట్లు  చూస్తుంటారు.

 – సూదా శివరామకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *