యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయితేజ్..!

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ చిత్రానికి  నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్ ‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్నారు. ఇందులో సాయితేజ్ సరసన న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ నో పెళ్లి..’ రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.
ఈ సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం స్టార్ట్ అయ్యింది. ఈ పాట విన్న వెంటనే.. అందరికీ నచ్చేసింది. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. మ‌రో ప‌క్క సాయితేజ్‌తో పాటు రానా, వ‌రుణ్ తేజ్ ఈ పాట‌లో క‌నిపించ‌డం ఈ పాటకు ప్ల‌స్ అయ్యింది. దీంతో ఈ పాట యూత్‌లోకి బాగా దూసుకెళ్లింది. ఇదే పాట‌ను టాలీవుడ్ సింగ‌ర్స్ అంద‌రూ క‌లిసి నో పెళ్లి క‌వ‌ర్ సాంగ్ అనే పాడటం విశేషం. ఇలా రోజు రోజుకీ ఈ పాట‌కు ఆద‌ర‌ణ పెరుగుతూనే ఉంది. 
ఇదిలా ఉంటే… ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇంతకీ ఏంటా రికార్డ్ అంటే… కోటి (10 మిలియ‌న్‌) వ్యూస్ ద‌క్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది. ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్  పాడారు. ఈ పాట సినిమా పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు. దీంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి… సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయితేజ్ ఇక ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్ సృష్టిస్తాడో చూడాలి.

వి.శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *