తెర వెనక హీరోలు వీళ్ళు..
తెర వెనక హీరోలు వీళ్ళు..
మేకప్ :- సినిమాలో నటుల పాత్ర గ్లామర్ అయినా డీ గ్లామర్ అయినా మేకప్ తప్పనిసరి. మేకప్ మెన్, విమెన్ లు పాత్రోచితంగా నటులకు మేకప్ వేస్తారు. మేకప్ తారల అందాన్ని రెట్టింపు చేసి మరింత గ్లామర్ తెచ్చి పెడుతుంది. హెయిర్ డ్రెస్సింగ్, విగ్ డిపార్ట్మెంట్ లు కూడా ఈ విభాగం కిందకే వస్తాయి. చిరంజీవి కి శివ, నాగార్జునకు చంద్రయ్య, కృష్ణ, మహేష్ కి పట్టాభి, రవితేజకి శ్రీనులు పర్సనల్ మేకప్ మెన్ లుగా వున్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ :- దుస్తులు ఆయా పాత్రల ఆర్థిక, సామాజిక స్థితిని వెల్లడి చేస్తాయు. ధనికుడు, పేదవాడు,కార్మికులు,… ఇలా రకరకాల స్థితిని తెల్పుతాయి. వస్త్రాలంకరణ నటుల పాత్రకు అనుగుణంగా ఉంటుంది. కాస్ట్యూమ్ డిజైనర్ , దర్శకుడి సూచన మేరకు ఆయా నటులకు దుస్తులు కుడతారు. కొన్ని దుస్తులను షోరూం నుండి అద్దె ప్రాతిపదికపై తెస్తారు. కొంతమంది పెద్ద నిర్మాతలు కాస్ట్యూమ్ డిజైనర్ లుగా ఫాషన్ డిజైనింగ్ లో శిక్షణ పొందిన వారిని తీసుకుంటుంటారు.
షాజీ, సుస్మిత ( చిరంజీవి ), రేణు దేశాయ్ ( గతంలో పవన్ కళ్యాణ్ ) , గౌతమి ( కమల్ హాసన్ ) , గౌరంగ్ షా ( మహానటి ) , భష్కీ ( సాహో ) లు కొందరు కాస్ట్యూమ్ డిజైనర్ లు.
ఆడియోగ్రఫీ :- మొదట ఆడియో గ్రాఫర్ షూటింగ్ స్పాట్లో నటుల డైలాగ్స్ ను రికార్డు చేస్తాడు. ఆపై స్టూడియోలో నటులు , డబ్బింగ్ ఆర్టిస్టులు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్తారు. దీనిలో డబ్బింగ్ , రీ రికార్డింగ్ , సౌండ్ ఎఫెక్ట్స్ అని మూడు విభాగాలుంటాయి . సంగీత దర్శకుడు , సౌండ్ ఇంజనీర్ కలసి వీటినీ నిర్వహిస్తారు. హారర్, థ్రిల్లర్, లవ్ …. ఇలా కథను బట్టే ఆడియో గ్రఫీ ఉంటుంది. ఎ చిత్రం లోనైనా సగ భాగం దీనిదే. రాంగోపాల్ వర్మ చిత్రాలలో ఆడియోగ్రఫీ ప్రాముఖ్యత గమనించవచ్చు . ఇటీవల ‘ రంగస్థలం ‘ చిత్రానికి ఉత్తమ ఆడియో గ్రాఫర్ గా ఎస్ ఎస్ రాధా కృష్ణ కు జాతీయ చలన చిత్ర అవార్డు దక్కింది.
స్టిల్ ఫోటో గ్రాఫర్ :- షూటింగ్ జరిగేటప్పుడు స్టిల్ ఫోటో గ్రాఫర్ ముఖ్యమైన సన్నివేశాలను , నటుల హావ భావాలను కెమెరాతో ఫోటోలు తీస్తుంటాడు . గతంలో విడిగా ఫోటొలకు ఫోజులు ఇచ్చేవారు. వీటితో పోస్టర్లు, ఇతర పబ్లిసిటీ డిజైన్ చేస్తారు. గతంలో మన సత్యం , ప్రస్తుతం మనీషా ప్రసాద్, సాయిరాం లు ప్రముఖ స్టిల్ ఫోటో గ్రాఫర్లు.
పబ్లిసిటీ డిజైనింగ్ :- ఒక కొత్త సినిమా గురించి ప్రేక్షకుడికి ముందుగా తెలియచెప్పేదే పబ్లిసిటీ . ఈ విభాగం లోకి పోస్టర్ డిజైనర్లు , పబ్లిషర్లు, ఆన్ లైన్ ప్రమోటర్లు వస్తారు . పోస్టర్ వెరైటీ , విభిన్నంగా ఉంటే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది . తెలుగు లో ఈశ్వర్ , గంగాధర్ లు ప్రముఖ పబ్లిసిటీ డిజెనర్లు.
దర్శకుడు :- ఒక షిప్ కు కెప్టెన్ ఎలానో , ఒక సినిమాకు దర్శకుడు అలాగా . దర్శకుడు పై 23 విభాగాలకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. సినిమాను తీసే గురుతర భాద్యత డైరెక్టర్ ది. దర్శకుడు అన్ని విభాగాలను కలుపుకుంటూ సినిమా తీస్తాడు . డైరెక్టర్ కింద అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్లు వుంటారు.
చిత్ర కథను అనుకున్న విధంగా తీయటం డైరెక్టర్ కు వుండే విసిష్టమైన కళ . వీరు కథ, సన్నివేశాలు, సౌండ్ ని సమానవీయం చేసుకుంటారు. ఒక చిత్రం విజయానికి , పరాజయానికి దర్శకుడిదే పూర్తి భాద్యత. నిర్మాత పెట్టిన డబ్బుని, టెక్నాలజీ ని, కళ ను సరిగ్గా ఉపయోగించు కొనేవాడే విజయవంతమైన దర్శకుడు.
ముగింపు :- # ఇటీవల గ్రాఫిక్స్ ను 25 వ క్రాఫ్ట్ గా గుర్తించాలనే నినాదం వస్తూంది . గ్రాఫిక్స్ ఎన్నో చిత్రాలు విజయవంత మవటాని కి కారణం అయ్యేయి .
#సినీ నిర్మాతకు పై 24 క్రాఫ్ట్స్ లో చోటు లేకపోవటం ఆసక్తికర అంశం . కోట్లు ఖర్చు పెట్టి , అన్ని క్రాఫ్ట్స్ లను కలిపి సినిమా తీసే నిర్మాతకు సాంకేతికం గా గుర్తింపు లేదు.
– సూదా శివరామకృష్ణ