సుశాంత్ సింగ్.. ఆత్యహత్యకి కారణం..?

సినిమాతో బాగా పాపులర్ అయిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్. ముంబై బాంద్రా లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ లో ముందుకు వెళుతున్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆత్యహత్య వెనుక గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియదు. సుశాంత్ వయసు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబం సభ్యులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈనెల 3న సుశాంత్ వాళ్ల అమ్మను తలచుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బుల్లి తెర నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన సుశాంత్ అనతి కాలంలోనే వెండితెర పై ఎంట్రీ ఇవ్వడం.. పాపులర్ అవ్వడం జరిగింది.  2013లో వచ్చిన కై పోచె చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. స్టార్ క్రికెటర్ ధోని బయోపిక్ సుశాంత్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఆయన గత చిత్రం చిచ్చోరి మంచి విజయం సాధించింది. సక్సెస్ పుల్ హీరోగా కొనసాగుతూ, ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న సుశాంత్ బలవన్మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సూసైడ్ చేసుకోవాల్సినంత బాధ అతనిలో ఏముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆత్యహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్ లో సుశాంత్ వివాహం చేసుకునేందుకు పెద్దలు నిర్ణయించారని తెలిసింది. అతని వివాహానికి సన్నాహాలను కూడా ప్రారంభించారు. ఈ విషయాన్ని సుశాంత్ కు వరుసకు సోదరుడయ్యే పన్నా సింగ్ తెలియచేసాడు. సుశాంత్ కూడా పెళ్లి మూడ్ లో ఉన్నాడని… ఇంతలోనే ఇలా జరిగిందని చెప్పారు. అయితే…. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్నాడని.. ఆ కారణంగానే ఆత్యహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *