సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు?

అవీ ఇవీ

సినీనటులు ఎవరు రాజకీయాల్లోకి రాకూడదు ? .. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ ముద్రగడ – పిఠాపురంలో హీరో పవన్‌ కళ్యాణ్‌ ను తన్నీ తరిమేయాలి… అలా చేస్తే సినిమా నటులు ఇక రాజకీయాల్లోకి రారని తెలిపారు.షూటింగ్ లు చేయడానికి ఎమ్మెల్యే పదవి కావాలా అంటూ నిలదీశారు. కష్టం వస్తే షూటింగ్ లకు వచ్చి చెప్పాలా…. ముఖానికి రంగు వేసుకుని తైతిక్కలాడుతూ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ పై నిప్పులు చెరిగారు.పెద్దలు… పిల్లల్ని కంట్రోల్ లో పెట్టాలని.. 2,30,000 ఓట్లు ఉంటే మూడు లక్షలు మెజారిటీ తో గెలుస్తానంటున్నాడని చురకలు అంటించారు ముద్రగడ పద్మనాభం.సీఎం దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని అనుకుంటున్నాను….సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని వెల్లడించారు ముద్రగడ. కాబట్టి పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నియోజకవర్గం నుండి తరిమియాలని ప్రజలకు తీర్పునిచ్చారు ముద్రగడ. అలాగే ఏ ఒక్క సినిమా నటులు  కూడా రాజకీయాల్లో రాకుండా చేయాలని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా జనసేన నేతలు,  నాయకులు, జన సైనికులు, ప్రజలు వైసిపి ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ఈ ముద్రగడ మాటలకు వైసిపి సమర్థిస్తుంటే జనసైనికులు మాత్రం విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *