డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన ప్రభాస్

Cinema News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD”.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ అయిన ‘బుజ్జి’ ది స్వాంకీ వెహికల్ రోబోట్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది.హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేసారు.ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తున్నాడు.భైరవ క్లోజ్ ఫ్రెండే ఈ బుజ్జి.ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.అయితే గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో ప్రభాస్ బుజ్జితో కలిసి మాస్ ఎంట్రీ ఇచ్చాడు.ఆ ఎంట్రీ చూసి అక్కడ వున్నఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.బుజ్జిని ప్రపంచానికి పరిచయం చేస్తూ దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్‌ ను కూడా విడుదల చేశారు.ఈ టీజర్‌ లోని విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేలా వున్నాయి. టెక్నికల్ అంశాలతో పాటు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. దాదాపు ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో ప్రభాస్ డాషింగ్ గా కనిపించాడు.అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ ..దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చెర్ పెట్టినట్లు ప్రభాస్ తెలిపారు.ఈ కార్యక్రమానికి క్యాజువల్‌ గా వద్దామని అనుకున్న కానీ నాగ్ అశ్విన్ నన్ను ఈ స్టంట్స్ చేసేలా చేశాడు. అలాగే ఈ సినిమాకు హైప్ పెంచడానికి నాతో ఆ ట్వీట్ చేయించాడు..అయితే బుజ్జి గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసాడు.బుజ్జి పేరు చిన్నది అయిన అది సినిమాకు చాల ప్రత్యేకం.బుజ్జి టీజర్ అందరికి నచ్చిందని ఆశిస్తున్నా అని ప్రభాస్ తెలిపారు.