విదేశాలకి వైయస్ విజయమ్మ

Andhra Pradesh Political

ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం చేయలేను…. అందుకే విదేశాలకి ? … :- వైయస్ విజయమ్మ…..ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చీలికలు మొదలవడంతో వైఎస్ విజయమ్మ పెద్ద ప్లాన్ వేసినట్లు అనిపిస్తుంది. గతంలో వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించడంతో.. ఆమె వెంట వైయస్ విజయమ్మ అడుగులో అడుగు వేసి నడిచారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంటే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ అధికారంలో ఉన్నారు. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తన రక్తం పంచుకు పుట్టిన ఈ ఇద్దరు బిడ్డలు.. ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో కుమార్తెకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే.. కుమారుడికి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కుమారుడికి కన్నతల్లిగా మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేపడితే.. కుమార్తెకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైయస్ విజయమ్మ ఓ విధమైన ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అదీకాక మార్చిలో సీఎం వైయస్ జగన్ మేము సిద్దం పేరిట ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర చేపట్టారు. ఆ సమయంలో కన్నతల్లి వైయస్ విజయమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకొని వైయస్ జగన్ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.మరోవైపు వైయస్ షర్మిల సైతం ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే.. బొట్టు పెట్టి మరీ ఆమెను ఆశీర్వదించారీ వైయస్ విజయమ్మ.అలాంటి పరిస్థితుల్లో శతక కారుడు బద్దెన చెప్పినట్లు ఒకరినొప్పింక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు మధ్యే మార్గంగా ఆమె విదేశాలకు వెళ్లిపోవడమంత ఉత్తమమైన మార్గం మరొకటి లేదని భావించి ఆమె విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇలా వైఎస్ విజయమ్మ తెలివిగా తప్పించుకున్నారని కొంతమంది అలాగే ఇలాంటి పరిస్థితులు ఇదే మంచి పని అని మరి కొంతమంది అనుకుంటున్నారు.