మలయాళం ఇండస్ట్రీలో రికార్డు.. 100 కోట్లకు కలెక్షన్లు

Cinema News

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ తాజాగా నటించిన సినిమా ‘గోట్ లైఫ్’.. ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలియజేసారు. కాగా ఈ చిత్రానికి థియేటర్స్ వద్ద ఆదరణ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. ఇంకా కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు.. రోజు రోజుకు పెరుగుతున్నాయి.. జనాలకు సినిమా అంత బాగా నచ్చిందని అర్థమవుతుంది.ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. కేరళకు నుంచి దుబాయ్ కి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు.. అక్కడ నుంచి ఎడారి మార్గం ద్వారా ఇండియా బయలు దేరతాడు.. ఇంతకీ హీరో ఇండియా కు చేరుకున్నాడా? మార్గమధ్యలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ.. ఆ దేశాలకు బ్రతుకుదెరువు కోసం వెళ్లిన ఇండియన్స్ ఎలాంటి జీవితాన్ని గడుపుతారన్నది సినిమాలో చక్కగా చూపించారు.. ఈ మూవీ కోసం హీరో, డైరెక్టర్ దాదాపు పదహారేళ్లు కష్టపడ్డారు.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ అయితే సినిమా కోసం చాలా కష్టపడి సన్నబడ్డాడు..