విడాకుల బాటలో బాలీవుడ్ భామ!

Cinema

ఇండస్ట్రీలో నటీ, నటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన విషయమే. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో.. తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటారు సదరు సెలబ్రిటీలు. ఇక ఇలా విడిపోయే వారి సంఖ్య టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో ఎక్కువగా ఉంటుంది. తాజాగా మరో జంట విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? తామిద్దరం విడిపోయాం అంటూ..భర్త ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ‘మేము విడిపోయాం.. ఈ కఠిన సమయం నుంచి బయటపడేందుకు మాకు కొంత సమయం ఇవ్వండి’ అంటూ రాసుకొచ్చాడు రాజ్ కుంద్రా. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతులు విడాకులు తీసుకున్నారా? వీరిద్దరు విడిపోయారా? ప్రస్తుతం ఈ రెండు ప్రశ్నలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం శిల్ప భర్త రాజ్ కుంద్రా చేసిన ట్వీటే. “మేము విడిపోయాము.. ఈ కఠిన సమయం నుంచి బయటపడేందుకు మాకు కాస్త టైమ్ ఇవ్వండి” అంటూ రాత్రి ఒంటి గంట సమయంలో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో.. నిజంగానే వారు విడిపోయారా? అంటూ ఆరా తీయడం మెుదలెట్టారు బీటౌన్ జనాలు. అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటున్నారు. రాజ్ కుంద్రా నటుడిగా మారి తన బయోపిక్ ను ‘యూటీ 69’ అనే టైటిల్ తో తెరకెక్కించాడు. ఇక ఈ మూవీతో రాజ్ కుంద్రా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా.. చాలా కాలంగా మాస్క్ తో ముఖం దాచుకుంటున్న అతడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్క్ తీసేశాడు. అయితే ఈ ట్వీట్ విడాకులు కాకుండా.. మాస్క్ తీసేసినందుకు చేశాడా? అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యూటీ 69 చిత్రం నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగానే రాజ్ కుంద్రా ఈ ట్వీట్ చేశాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక 2021లో నీలిచిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యి.. 6 నెలలు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ తాను ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు.