భయంతో పెళ్ళికి దూరముగా నిత్యా మీనన్

Cinema

నిత్యా మీనన్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లుపైనే అవుతోంది. ఆమె 8 ఏళ్ల వయసులోనే చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1998లో వచ్చిన ‘‘ హనుమాన్‌’’ అనే ఇంగ్లీష్‌ సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టారు. చాలా ఏళ్ల తర్వాత 2006లో హీరోయిన్‌ గా మారారు. ఓ కన్నడ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయ్యారు. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. పని చేసిన అన్ని భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా జీవితం గురించి పక్కన పెడితే.. ప్రతీసారి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. అదే ఆమె పెళ్లికి సంబంధించిన విషయం. తాజాగా, ప్రముఖ తమిళ నటుడు బైల్వాన్‌ రంగనాథన్‌ నిత్యా మీనన్‌ పెళ్లిపై సంచలన కామెంట్లు చేశారు. ఓ బలమైన కారణం వల్లే ఆమె పెళ్లి చేసుకోవడం లేదని అన్నారు. కొన్నేళ్ల క్రితం ఓ ప్రముఖ మలయాళ నటి పెళ్లి చేసుకుందని.. అయితే వరకట్నం, గృహహింస కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని.. ఈ భయమే నిత్యామీనన్‌ ను భయపెడుతోందని అన్నారు. పెళ్లి చేసుకుంటే తాను కూడా ఇలా గృహ హింసకు గురి కావాల్సి వస్తుందని ఆమె భావిస్తోంది. ఇది ఓ కారణం అయితే.. బరువు కారణంగా కూడా ఆమె పెళ్లికి దూరంగా ఉంటోందని నటుడు రంగనాథన్ చెప్పుకొచ్చారు. కాగా, నిత్యా మీనన్‌ తాజాగా ‘ కుమారి శ్రీమతి’ అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీని పలకరించారు. ఆ వెబ్‌ సిరీస్‌ కు మంచి స్పందన వచ్చింది.