జనసేనకు మద్దతుగా జబర్దస్త్ టీం ప్రచారం

Andhra Pradesh Political

జనసేనకు మద్దతుగా జబర్దస్త్ టీం ప్రచారం : అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్‌, సినీ నటులు గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ పట్టణంలో ప్రచారం నిర్వహించారు.ముందుగా శ్రీరామ నవమి పురస్కరించుకొని సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. గవరపాలెం, వేల్పులవీధి, చాకలిపేట, శాఖవీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. డైలాగులతో ఓటర్లను చైతన్యపరిచారు. మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు. హారతులు ఇచ్చి దీవించారు. వీరితో ఫొటోలు దిగడానికి యువకులు ఆసక్తి చూపారు. దీంతో పక్కాగా ఈసారి జనసేన అనకాపల్లిలో భారీ మెజారిటీతో గెలుస్తుంది అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది.