ప్రధాని మేనిఫెస్టో నచ్చని కేంద్ర మంత్రి

National Political

ప్రధాని విడుదల చేసిన మేనిఫెస్టో నచ్చక… సొంతంగా మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా ఎంపీ: నాగపూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నితిన్ గడ్కరీ సొంతంగా మేనిఫెస్టోను ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ మేనిఫెస్టో ప్రకటించిన రెండు రోజులకే ఆయన సొంతంగా మేనిఫెస్టోను విడుదల పలు సందేహాలకు కారణం అవుతోంది.వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలతోపాటు అభివృద్ధి, పరిశుభ్రత విషయంలో నాగ్ పూర్ ను అగ్రస్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు గడ్కరీ.ఉద్యోగాల భర్తీపై మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ సర్కార్ పై ఇప్పటికే పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ సొంతంగా ప్రకటించిన మేనిఫెస్టోలో లక్ష ఉద్యోగాలు అనే హామీ… ఉద్యోగాల విషయంలో మోడీపై నమ్మకం లేకే ఆయన నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు ఈ హామీ ఇచ్చారా.? అనే ప్రచారం జరుగుతోంది.సొంతంగా మేనిఫెస్టో ప్రకటించడం నిషేధం కాదు కానీ, నితిన్ గడ్కరీ ప్రకటించడం పలు సందేహాలకు కారణం అవుతోంది. మోడీ – నితిన్ గడ్కరీ మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మోడీ తర్వాత నితిన్ గడ్కరీ అని ఆర్ఎస్ఎస్ ఆయన పేరును ప్రతిపాదిస్తే మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారని ప్రచారం ఉన్నది. గడ్కరీకి చెక్ పెట్టేందుకే యోగిని మోడీ ఎంకరేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.