సీఎం సీట్ ను షేర్ చేసుకుంటారా ?

Andhra Pradesh Political

ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే…. సీఎం సీట్ ను షేర్ చేసుకుంటారా ?…ఏపీలో అధికారాన్ని దక్కించుకునేందుకు కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ పాత్ర ఏమిటి అన్నది బలంగా చర్చ జరుగుతోంది.మొన్నటి వరకు అయితే పవర్ షేరింగ్ పై పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. కానీ వాటన్నింటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు దక్కాయి. అయితే ఈ సీట్లలో జనసేన గెలిచే స్థానాలు బట్టి.. కూటమి ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యత తెలుస్తుంది. అయితే చంద్రబాబు సీఎం షేరింగ్ పవన్ కళ్యాణ్ కు కల్పిస్తారా? లేకుంటే సీఎంతో సమానమైన పదవిని క్రియేట్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.పవన్ ను సీఎంగా చూడాలని కాపులు ఆశిస్తున్నారు. కానీ పవన్ ఈ విషయంలో చంద్రబాబుతో ఎటువంటి స్పష్టత తెచ్చుకోలేకపోయారు. పైగా గత ఎన్నికల్లో తనను గెలిపించి ఉంటే ప్రశ్నించి ఉండేవాడినని.. పవర్ షేరింగ్ విషయమై గట్టిగానే మాట్లాడి ఉండేవాడినని పవన్ చెప్పుకొచ్చారు. తన పార్టీకి సీట్ల కేటాయింపు విషయంలో హరి రామ జోగయ్య వంటి వారు ఇచ్చిన సలహాలను సైతం పవన్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. పైగా ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ఉద్యమ నేత పార్టీలోకి వస్తానన్న పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ పరిణామాల క్రమంలో పవన్ పవర్ షేరింగ్ కు పట్టుబడరని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం.. క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమని పవన్ సంకేతాలు ఇస్తున్నారు.