జగన్ రాయి దాడి లో కీలక మలుపు

Andhra Pradesh Political

ఇది టిడిపి చేసిన పని కాదు… ! పక్కా జగన్ నాటకం!.. అందుకే గుట్టు చప్పుడు లేకుండా నేరుగా కోర్టుకి నిందితులు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019లో జగన్ బాబాయి మర్డర్ ఒక సంచలనం అయితే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసు ఒక సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి దాడి పై పోలీసులు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. జగన్ పై రాడి దాడి కేసులో నిందితులుగా ఉన్న వాళ్లని పోలీసులు ఎవరికి తెలియకుండా కోర్టుకి తీసుకెళ్లారు. వాళ్లతో పాటు వాళ్లకి ఎవరైతే అనుమానంగా కనిపించారు వాళ్లను కూడా ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు సమీపంలోని వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి చేసినట్లు నిందితులు పోలీసులకి చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడితో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా వారి నుంచి స్టేట్‌మెంట్ పోలీసులు రికార్డ్ చేసినట్లు చెప్తున్నారు. రాయితో దాడి చేసిన అనంతరం నిందితులు ఇళ్ళకు వెళ్లిపోయినట్లు పోలీసులు అంటున్నారు.అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రకటించడం కానీ.. మీడియా ముందుకు తీసుకురావడం కానీ జరగలేదు. ఏకంగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్ అంశంలో ఊహాగానాలు తప్ప అసలు ఏం జరిగింది? ఏంటి? నిందితులను అరెస్ట్ చేశారా? లేదా? అనే విషయాలేమీ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. వైసీపీ నేతలు మాత్రం టీడీపీయే ఈ దాడికి తెగబడిందంటూ ఇష్టానుసారంగా మాటల దాడి చేశారు. ఒకవేళ టీడీపీ నేతలే ఈ దాడికి తెగబడి ఉంటే సీన్ మరోలా ఉండేది. ఇలా గుట్టు చప్పుడు కాకుండా నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టి ఉండేవారు కాదు. తొలుత అయితే జనం ఇలాంటి నీచ ఎత్తుగడలను పసిగట్ట లేదు కానీ పదే పదే అదే ప్రణాళికను అనుసరిస్తుంటే జనాలకు సీన్ అర్థమైపోయింది అని టిడిపి నాయకులు అంటున్నారు. ఇలా రాష్ట్రంలో రోజురోజుకు వైసిపి మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలు గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు.