మూడు దశాబ్దాలుగా రాజకీయం…. కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

Andhra Pradesh

అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబుని టిడిపి అధిష్టానం నియమించింది. నిన్న ఆదివారం మధ్యాహ్నం టిడిపి కార్యాలయం నుంచి ఈ ప్రకటనను విడుదల చేశారు. తాతయ్య బాబు గారు దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిన్నచిన్నగా ఎదుగుతూ మొదటగా వార్డు మెంబర్ గా అలాగే సర్పంచిగా మరియు ఎంపీపీగా బాధ్యతలను వహించారు. అలాగే ఇతను మూడు ఏళ్లుగా చోడవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా కూడా పనులు చేశారు. ప్రస్తుతం చోడవరం ఎమ్మెల్యే టికెట్ ఆశించగా కానీ చంద్రబాబు మాత్రం సర్వేలో తాతయ్య బాబు కన్నా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాజు పైనే ఎక్కువ మంది మొగ్గు చూపడంతో అతనికి టికెట్ కేటాయించారు. దీంతో తాతయ్య బాబుకు టికెట్ రాలేదు. ఒకసారిగా కుంగిపోయిన తాతయ్య బాబు విజయవాడ టిడిపి పార్టీ ఆఫీసులో చంద్రబాబు గారిని కలిశారు. అయినప్పటికీ గతంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు గారు తాతయ్య బాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఏకంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో తాతయ్య బాబుకు అధ్యక్షుడిగా నియమించినందుకు సంతోషపడ్డారు. అత్యధిక మెజార్టీతో అనకాపల్లి టిడిపి గెలుపుకు బలోపేతం చేస్తానని చెప్పారు. అలాగే అనకాపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం లో ఎలక్షన్ సంఘం పత్రికా సమావేశాల సమన్వయకర్తగా మాజీ మంత్రి వీరభద్ర రావు ను నియమిస్తూ ఆ పార్టీ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ నాయకుడు కాబట్టి వీరభద్ర రావును ఈ ఎలక్షన్ సమయంలో అతని యొక్క సుదీర్ఘ అనుభవం ఉపయోగించుకోవాలి అని కీలక కీలక బాధ్యతలు అప్పగించారు.