చిరంజీవి కంటే దళపతి బెటర్

Stars

ఆ విషయంలో చిరంజీవి కంటే దళపతి బెటర్ …. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్….మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అనే పేరు వినగానే గుర్తుకు వచ్చే మొదటి కీర్తి సురేష్.ఇప్పుడు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు హిందీ సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కీర్తి సురేష్ తెలుగులో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజీ సంపాదించుకున్న ఈ హీరోయిన్ నేను శైలజాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మహానటి ఎంతోమంది ప్రేక్షకులను తన వశం చేసుకున్నారు. తర్వాత వరుసగా యంగ్ హీరోలతో నటించి ఇంకా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ తమిళ్లో రఘు తాత అనే సినిమాలో నటిస్తోంది. ఇది లేడి ఓరియంటెడ్ మూవీగా రానుంది. ఇటీవలే ఈ సినిమా యొక్క ట్రైలర్ను విడుదల చేశారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

మంచి జ్యోతిష్య సేవల కోసం చూస్తున్నారా …ఇక్కడ CLICK చేయండి

సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ను జోరుగా సాగిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ లో భాగంగా తాజాగా కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మెగా హీరో అయినటువంటి చిరంజీవి కన్నా హీరో తలపతి డాన్స్ బాగా చేస్తాడని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీనిపై టాలీవుడ్ మెగా హీరో అభిమానులు కీర్తి సురేష్ పై ఫైర్ అవుతూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే కీర్తి సురేష్ హీరో తలపతితో భైరవ మరియు సర్కార్ అనే మూవీలో నటించింది. చిరంజీవితో భోళా శంకర్ లో సిస్టర్ గా నటించింది. అయితే హీరో దళపతి విజయ్ పై ఉన్న అభిమానంతో ఆమె ఇలా చెప్పి ఉండొచ్చని కొందరు నిటిజన్లు సపోర్ట్ చేస్తుంటే, మెగా అభిమానులు చిరంజీవి డ్యాన్స్ నీ వంక పెడతావా అని ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా ఈ కామెంట్స్ పై హీరోయిన్ కీర్తి సురేష్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడక తప్పదు.