పవన్ కళ్యాణ్ మాటలపై ప్రకాష్ రాజ్ కౌంటర్.. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సభ వేదిక లో భాగంగా పవన్ కళ్యాణ్ హిందీ భాష పై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ వేశారు . మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నిన్న పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం లో భాగంగా జయకేతనం కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ హిందీ భాష కూడా దేశభాషే కదా. తమిళనాడులో హిందీ వద్దని అనడం ఎంతవరకు కరెక్టో… మరి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. అన్నారు. హిందీ సినిమాల వాళ్ల డబ్బులు కావాలి కానీ హిందీ భాష వద్దంటే ఎలా అని… స్టాలిన్కు కౌంటర్ వేశారు పవన్ కళ్యాణ్. మనం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు… మన భారతదేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. దీనికి కౌంటర్ గా ఇవాళ ప్రకాష్ రాజ్ తిరిగి కౌంటర్ వేశారు. తిరుమల లడ్డు వ్యవహారం మరియు సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కూడా ప్రకాష్ రాజు గతంలో పంచులు వేసిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ మరియు ప్రకాశం మధ్య నిత్యం సోషల్ మీడియాలో వైరం నడుస్తూనే ఉంది.
