బెట్టింగ్ ప్రమోటర్స్ కు దబిడి దిబిడే… పదిమందిపై కేసులు నమోదు.. బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరం. కానీ అవి ఏమి పట్టనట్టుగా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యదేచ్చగా బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరిని కూడా చట్టరీత్యా నేరం కింద పరిగణించలేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారిపోయాయి. ప్రతిరోజు బెట్టింగుల కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో కొన్ని లక్షల్లో కేవలం బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తాజాగా అధికారుల దృష్టికి రావడంతో బెట్టింగ్ పై అలాగే బెట్టింగ్ ప్రమోటర్స్ పై అవగాహన కల్పిస్తూ ఇల్లీగల్ బెట్టింగ్ సైట్లు ఎవరైనా ప్రమోట్ చేస్తే కచ్చితంగా వారిని చట్టపరంగా శిక్షిస్తామని వార్త కథనాలు రాయడంతో పాటుగా నేరుగా సోషల్ మీడియా వేదికగానే హెచ్చరిస్తున్నారు. అయితే ఇవేం పట్టనట్టుగా చాలామంది బెట్టింగ్ ప్రమోట్ చేస్తూనే ఉండడంతో కొంతమంది ప్రముఖ యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ ను పట్టుకొని శిక్షించాలని… బెట్టింగ్స్ కారణంగా చాలామంది యువత నాశనం అయిపోతున్నారని.. ఒకానొక సమయంలో ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలకు దిగజారిపోయారని ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్న మారడం లేదని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే తాజాగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ, మరో ప్రముఖ యూట్యూబర్ రామా బాయ్ , అలాగే యువ సామ్రాట్ అనే వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ ను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ప్రతి రోజు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ప్రపంచయాత్రికులు నా అన్వేషణ అనే యూట్యూబ్ తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తో బెట్టింగ్ గురించి మాట్లాడడం జరిగింది. బెట్టింగుల కారణంగా ఎంతో మంది యువత నాశనం అవుతున్నారని అన్వేష్ సజ్జనార్ కు వివరించారు. బెట్టింగ్ అనేది ఒక విధంగా వ్యసనమని.. చాలామంది విదేశాలకు చెందిన సైబర్ మోసగాళ్లు బెట్టింగ్ యాప్లను ఉపయోగించి చాలా మోసాలకు పాల్పడుతున్నారని… బెట్టింగులో కడుతూ తమ డబ్బులు పోగొట్టుకొని ఆ బెట్టింగ్ యాప్లకు బానిసలుగా చదువుకున్న యువతరం మారిపోతుందని.. సమాజాన్ని మీలాంటి పోలీస్ అధికారులు ఎలాగైనా గాడిలో పెట్టాలని సజ్జనార్కు వివరించారు. విదేశాల్లో తయారుచేసిన బెట్టింగ్ యాప్లను భారతదేశంలో నిషేధించాలని కోరారు. ఈ బెట్టింగ్ లోను ప్రమోట్ చేసే వారిని కూడా కఠినంగా శిక్షించాలని తెలిపారు. బెట్టింగ్ యాప్ వల్ల డబ్బులు కోల్పోతే ఆర్థికంగా చిదికిపోయి ప్రమాదపు అంచులకు వెళ్లి పోతారు. ఒత్తిడి మరియు ఆందోళన అలాగే నిరాశ వంటి మానసిక సమస్యలు కూడా వెంటపడతాయి. బెట్టింగ్ అలవాటు వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు అలాగే బంధుత్వాలు కూడా తగ్గిపోతుంటాయి. డబ్బులు పోగొట్టుకున్న వారు డబ్బులు కోసం నేరాలుకు కూడా పాల్పడే అవకాశం కూడా ఉంది. అప్పులు చేయడం… ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవడం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి బెట్టింగ్ యాప్స్ నువ్వు డౌన్లోడ్ చేయవద్దు.. బెట్టింగ్ ప్రకటనలకు కూడా చాలా దూరంగా ఉండండి.
