ఒక సినిమా అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు, నటీనటులు అలాగే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఒక సినిమా ఇండస్ట్రీలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా హీరో హీరోయిన్లు అలాగే డైరెక్టర్లు ఇంకాస్త ముందుకెళ్తే నిర్మాతల పేర్లు గుర్తుండిపోతాయి. కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆర్ట్ డైరెక్టర్. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతమంది హీరో హీరోయిన్లు ఎన్నో రికార్డులను నెలకొల్పారు.
ప్రతిరోజు మనం హీరో, డైరెక్టర్ల రికార్డులు మాత్రమే చూస్తుంటాం. కానీ ఎవరూ కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్ రికార్డులనేవి చూడరు. కానీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సింది ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి. అతను ఎవరో కాదు కొల్లా అవినాష్. ఇతని గురించి పెద్దగా ఎవరికి తెలియకపోయినా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వ్యక్తి. ఎందుకంటే ఇతని సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. ఈ రికార్డులు సాధించాలంటే వేరే ఆర్ట్ డైరెక్టర్ కి కొన్ని ఏళ్ల సంవత్సరాలే పడుతుంది. ఒక సినిమా కోసం ఏకంగా 500 మంది నివసించేలా ఒక గ్రామాన్నే తయారు చేశాడు ఈ ఆర్ట్ డైరెక్టర్. సాధారణంగా ఏ ఆర్ట్ డైరెక్టర్ అయినా సరే కొత్త కొత్త ఆలోచనలతో సరికొత్తగా సినిమాలలో ట్రై చేస్తూ ఉంటారు. కానీ అవినాష్ కొల్లా అనే వ్యక్తి కంటి చూపుతోనే సినిమా సెట్ ను ఊహించేస్తాడు.
ఒకటి, రెండు సినిమాలే కాదు ఏకంగ పదుల సంఖ్యలలో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి ఎన్నో సినిమాలను బ్లాక్ బస్టర్ గా నిలిపారు. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరికి చిన్న, పెద్ద అనే భేదం లేకుండా పనిచేస్తుంటారు. హీరో నానిని మొదలుకొని సినిమా ఇండస్ట్రీ పెద్దలు అయినటువంటి బాలకృష్ణ, రామ్ చరణ్ ల సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. కొల్ల అవినాష్ మొదటిసారిగా నాని సినిమాతో తాను ఆర్ట్ డైరెక్టర్గా జీవితాన్ని ప్రారంభించాడు. నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాథ, జెర్సీ, శ్యాంసింగ్ రాయి, dasara సినిమాలకు కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించినవే. అయితే ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోదలిసిన విషయం దసరా సినిమా. ఈ సినిమాకి నాని నటన ఎంత ప్రాముఖ్యత చెందిందో… కొల్ల అవినాష్ ఆర్ట్ ప్రాముఖ్యత కూడా అంతే ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ కొల్లా అవినాష్ చేసిన సాహసం… ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ కూడా చేయలేదు. తన నైపుణ్యంతో కథ వినగానే కథకు తగ్గట్టుగా 500 మంది నివసించే చిన్న పల్లెటూరు ను నిర్మించారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్. అయితే ఇందులో ఏం ప్రాముఖ్యత ఉంది అని ప్రతి ఒక్కరికి సందేహం కలగవచ్చు. కానీ ఇందులోనే ఇల్లు, స్కూలు, మైదానం, బార్స్, పశువుల పాకలు… ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇందులో విశేషమేంటంటే అవన్నీ కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. సినిమా 98% షూటింగ్ మొత్తం కూడా Art డైరెక్టర్ అవినాష్ సెట్ చేసిన సెట్ లోనే జరిగిందట. దీంతో ఆర్ట్ డైరెక్టర్ గా తన నైపుణ్యానికి ఎన్నో అవార్డులు కూడా లభించాయి. సినిమా ఇండస్ట్రీలోని పెద్దల నుండి ఈ చిన్న వారి వరకు కూడా అందరి నుండి అభినందనలు వెలుబడ్డాయి. అంతేకాకుండా 22 ఎకరాల్లో రెండున్నర నెలలు 800 మందికి పైగా పనిచేసే సెట్ కూడా వేశారు.
రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాలో కూడా ఆర్ట్ డైరెక్టర్గా కొల్ల అవినాష్ గారు పనిచేశారు. తన జీవితమంతా కూడా చిన్నచిన్న హీరోలతో మొదలై నేడు తన నైపుణ్యం, తన పనితనం మెచ్చుకొని పెద్దపెద్ద హీరోలే ఆఫర్స్ చేస్తున్న సిట్యుయేషన్ కి కి ఇవాళ అవినాష్ ఎదిగారు. ఇలాంటివారు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరకడం మనందరం అదృష్టంగా భావించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుందంటే ఇదేనేమో. కేవలం అవినాష్ తన నైపుణ్యంతో ఆర్ట్ డైరెక్టర్గా ఒక సెట్ తోనే సినిమాలను హిట్ చేసే కెపాసిటీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరకడం ఒక అదృష్టంగా భావించాలి. ఇప్పటివరకు కొల అవినాష్ గారు స్వాతిముత్యం, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, దసరా, గాండీవధారీ అర్జున, హాయ్ నాన్న, టైగర్ నాగేశ్వరరావు, ఆపరేషన్ వాలెంటైన్, అమిగోస్, లవ్ మీ, మిస్టర్ బచ్చన్, సైంధవ్, గేమ్ చేంజర్ అలాగే తాజాగా వచ్చిన డాకు మహారాజ్ వరకు ఎన్నో మంచి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.
LOOKING BEST SERVICES MATRIMONY – ASTROLOGY – VASTU – ABROAD CONSULTANCY CLICK
их популярность ведет к тому, что какие-то из них становятся платными.
Here is my blog … ramblermails.com
plastic cards efficient proven themselves. You should make sure that your
card is open for international purchases, due to the
fact that exactly so active online casinos in the USA
encode your account in an paradise8.
2. ✅ Haga clic en “Registrarse”: Busque el botón amarillo
que dice” registro en la esquina superior derecha de directorio William Hill Casino.
Visit my website :: fueraya.es
юрист по международной сертификации медицинских фирм и пищевых
предприятий Николай Дубинин и специалист по оформлению
документации.
Review my homepage: https://postroy-sam.info/novosti/razrabotka-texnicheskix-uslovij-ot-idei-do-realizacii.html
сейчас получить ИСО реально в 164 странах мира.
Also visit my website – https://leaba.ru/the_articles/tehnicheskie-usloviya.html