హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న  స్టార్ హీరో కూతురు!..

Cinema

స్టార్ హీరో కిచ్చా  సుదీప్ కూతురు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుంది. కన్నడ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలలో కిచ్చా సుదీప్ గారు ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈగ అనే సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తిగా  ఈ కన్నడ హీరో కిచ్చా సుదీప్ నిలిచారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆసక్తికరంగా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలోనే తన కూతురు సాన్వి సుదీప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో చాలా టాక్ నడుస్తుంది. దీంతో ఆయన అభిమానులు శాన్వికి స్వాగతం పలుకుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ నేను ఇంకా అలసిపోలేదని… కానీ ఏదో ఒక రోజు సినిమాల నుంచి  రిటైర్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో సుదీప్ ఫ్యాన్స్  షాక్ అవుతున్నారు. ఇక ఇదే సమయంలో ఒక  పాడ్ కాస్ట్  లో  పాల్గొన్నారు సుదీప్ కూతురు శాన్వి. ఆమె  మాట్లాడుతూ నాకు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టాలనే  ఇంట్రెస్ట్ ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నానని… హైదరాబాదులో నాలుగు నెలలు వర్క్ షాప్ లో శిక్షణ తీసుకున్నానని సొంతంగా అవకాశాలు సంపాదించుకోవాలని ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. తండ్రి పేరు చెప్పుకుంటే అవకాశాలు వస్తాయి కానీ అలా రావడం నాకు అసలు ఇష్టం లేదని… నటిగా మారడానికి తనకు చాలా సమయం కావాలని తెలిపింది.  కేవలం నటనలోని కాకుండా మరోవైపు దర్శకత్వం అలాగే స్క్రిప్ రైటింగ్ లోను రాణించే ఆలోచనలలో ఉన్నానని… ఇండస్ట్రీలో ఉంటే అన్ని విభాగాల్లోనూ ప్రయత్నించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చాలా కాలంగా నేను అధిక బరువుతో బాధపడుతున్నానని… కాబట్టి నటిగా మారేందుకు మరింత సమయం పట్టవచ్చు అని తెలిపింది. దీంతో ఏదైతేనే సుదీప్ గారి కూతురు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతుందన్న వార్తను విన్న అభిమానులు చాలా ఆనందంలో మునిగితేలుతున్నారు.

ASTROLOGY SERVICE – VASTU CONSULTANTS – MATRIMONY SERVICE – ABROAD EDUCATION