క్రిష్ 4 బడ్జెట్ చూస్తే మతిపోవాల్సిందే?

Cinema

మన భారతదేశంలో సూపర్ హీరోస్ అంటే మొదటిగా గుర్తుకు వచ్చే పేరు క్రిష్. హీరో హృతిక్ రోషన్ ఆయన తండ్రి రాకేష్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ పాన్  ఇండియా మూవీ 2006 లోనే చాలా రికార్డులను బద్దలు కొట్టి మంచి విజయం సాధించింది. హిందీ భాషలోనే కాకుండా తెలుగులోనూ అలాగే ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లను రాబట్టి చిన్నపిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ అలరించింది ఈ సినిమా. అయితే తాజాగా ఈ సినిమా బడ్జెట్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారట. ఇక 2013లో క్రిష్ 3 వచ్చిన విషయం కూడా మన అందరికి తెలిసిందే. ఇక తాజాగా క్రిష్  4 కోసం  రాకేష్ రోషన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఈ సినిమా పట్టాలు అయితే ఎక్కట్లేదు. ఈ సినిమా కోసం  బడ్జెట్ 700 కోట్లు అవుతుందట. అయితే ఇంత మొత్తం పెట్టి సినిమా తీయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చే సాహసం చేయటం లేదు. ఇంత డబ్బును పెట్టడానికి ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా సిద్ధంగా లేకపోవడంతో ఈ సినిమాను మొదలుపెట్టడం కొంచెం కష్టం గా అనిపిస్తుంది. అయితే దీనికోసం హీరో రుతిక్ రోషన్, సిద్ధార్థ్  ఆనంద్ ను  రంగంలోకి దించినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి సిద్ధార్థ బయటికి వచ్చాడని టాక్  వినిపిస్తుంది. కాబట్టి వార్ సినిమా  విడుదలయ్యే దాక వేచి చూడాలని హృతిక్ రోషన్ ఫ్యామిలీ నిర్ణయించుకోవడంతో క్రిస్ ఫోర్ సినిమాకి పెద్ద బ్రేక్ పడింది. గత పది సంవత్సరాలలో ఎన్నో హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ మనదేశంలో భారీ వసూలను  సాధిస్తూనే ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ సినిమాను చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా ఇప్పుడు పూర్తవుతుందో అని చాలామంది ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వార్ కనుక బ్లాక్ బస్టర్ అయితే హృతిక్ రోషన్ మార్కెట్ మరింత బలపడుతుంది కాబట్టి అప్పుడు 700 కోట్లు పెద్ద మ్యాటర్ అని అనిపించదు. కాబట్టి అప్పుడు ఆ సినిమాని వెయ్యి కోట్లు అయినా పెట్టి సులభంగా తీసే అవకాశం ఉంది. ఒకప్పుడు హృతిక్ రోషన్ కి ఉన్న ఫాలోయింగ్… ఇప్పుడు ఉందా అంటే అది ప్రతి ఒక్కరిలో ను  డౌట్ గానే అనిపిస్తుంది.