మెగాస్టార్ కు మరో అవార్డు

Anekam

లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి!….టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ‘చిరంజీవి’ అనే పేరు ప్రతి ఒక్కరికి చిరకాలం గుర్తుండిపోతుంది. దాదాపుగా మూడు తరాల నుంచి చిరంజీవి ప్రతి ఒక్కరిని కూడా తన సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ  60 సంవత్సరాలు పైబడిన కూడా యువతరం హీరోలకు దీటుగా వెళుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో తనే పెద్ద దిక్కుగా మారిపోయాడు. అటువంటి  మెగాస్టార్ చిరంజీవి తన లైఫ్ లో ఎన్నో అవార్డులను పొందగలిగాడు. అయితే తాజాగా  యూకే పార్లమెంట్లో చిరంజీవికి ఘన సత్కారం లభించింది. “లైఫ్ టైం అచీవ్మెంట్” పురస్కారాన్ని చిరంజీవి తాజాగా అందుకున్నారు. 

 అయితే చిరంజీవి పేరు మీద ఉన్న రికార్డ్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఎన్నో awards అందుకున్న మెగాస్టార్… తాజాగా నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను, యూకే కు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు  మిశ్రా,చిరంజీవి గారిని సన్మానించారు. మార్చ్ 19న జరిగిన ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్ అలాగే జాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా హాజరవడం జరిగింది. ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, ప్రజాసేవ… దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్  కోసం చిరంజీవి “జీవిత సాఫల్య పురస్కారం” అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. 

  తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన  ‘భోళా శంకర్’ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమయ్యింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో  చిరంజీవి అభిమానులంతా త్వరలో రాబోయే  ‘విశ్వంభర’ సినిమా గురించి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ అనేది శర వేగంగా జరుగుతూ వస్తుంది. ఇందులో త్రిష కథానాయకగా నటిస్తూ ఉండగా… మరో హీరోయిన్ ఆశిక రంగనాథన్ సైతం ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఘనతను సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఇప్పటివరకు చిరంజీవి 150 కు పైగానే సినిమాలు చేయడం జరిగింది. ఎంతోమంది యువత హీరోలను సైతం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తున్నారు. 

FIND PERFECT MATRIMONY SERVICES NOW EASY JUST CLICK