రెండు వారాల గ్యాప్ లోనే మూడు భారీ బడ్జెట్ సినిమాలు

Cinema

మైత్రి మూవీసా!… మజాకా!.. రెండు వారాల గ్యాప్ లోనే మూడు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల…టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద నిర్మాణ సంస్థ’మైత్రి మూవీ మేకర్స్’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు మైత్రి మూవీ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేసిన సినిమాలు చాలా మంచి విజయాలను సాధించడమే కాకుండా భారీ వసూలను కూడా రాబట్టి సక్సెస్ఫుల్గా సాగుతుంది. అయితే తాజాగా రెండు వారాల గ్యాప్ లోనే 3 పెద్ద సినిమాలను థియేటర్లోకి తీసుకురాబోతుంది.  ఈనెల చివరి ఆఖరిలో దాదాపు 70 కోట్ల బడ్జెట్తో నిర్మించిన నితిన్, శ్రీ లీల కాంబినేషన్లో వస్తున్న “రాబిన్ హుడ్”  సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కాస్త ఆలస్యంగా విడుదల కాబోతున్న కానీ ఈ  సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే నెలకొన్నాయి. నిర్మాణ ఖర్చులు ఎక్కువగా పెరిగి వడ్డీల భారం కూడా బాగానే పెరిగింది. 

 ఇక మరోవైపు ఏప్రిల్ మొదటి వారంలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అజిత్ నటించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమా దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఇదే టైంలో మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గోపీచంద్ మలినేని  మరియు సన్నీ డియోల్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. ఈ రెండు సినిమాల మీద కలిపే థియేటర్ నుంచి దాదాపుగా 200 కోట్ల వరకు రావాల్సి ఉంటుందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు. అంటే రెండు వారాల గ్యాప్ లోనే దాదాపుగా 250 కోట్లు  థియేటర్ నుంచి మూడు సినిమాల  ద్వారా మైత్రి మూవీ సంస్థ  రాబట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఇది చాలా పెద్ద ఫైట్ అనే చెప్పాలి. తెలుగు సినిమాల సంగతి ఎలా ఉన్నా హిట్టు అనిపించుకుంటే తమిళ్ మరియు హిందీ సినిమాల నుంచి డబ్బులు చాలా బాగా వస్తాయి. ఇక స్టార్ హీరోలు కాబట్టి బాగానే వసూళ్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదంతా  జరిగే వరకు కచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. 

 అయితే మైత్రి మూవీ మేకర్స్ అనేది కథను ఎంచుకొని మరి చిన్న సినిమాలైనా సరే నిర్మిస్తుంది. కానీ ఒక్కసారిగా మూడు భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తుంది కాబట్టి… మైత్రి మూవీ మేకర్ సంస్థకు సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే ఒకేసారి ఇంత భారీ బడ్జెట్ సినిమాలతో విడుదల కు సిద్ధమవడం అనేది చాలా సాహసం అనే చెప్పాలి. అది కూడా ఒకే వారంలో రిలీజ్ చేయడం అనేది పెద్ద సవాల్ అని చెప్పాలి. కానీ మైత్రి మూవీ మేకర్ సంస్థ పట్టుదల అలాగే నమ్మకం అనేవి చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు చాలా బాగా వసూళ్లు రాబడుతుందని ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ఏది ఏమైనా కూడా మూడు సినిమాలు హిట్ టాక్ వస్తే  కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా మంచి లాభాలను కూడా తెచ్చి పెడతాయి. అదే నెగిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా భారీ నష్టాలను చవిచూసేటువంటి అవకాశం ఉంది.

FIND BEST PROPERTIES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *