‘‘షకీలా ” పేరు వినగానే … మీ మనస్సు సీతాకోకచిలుకలా రెక్కలు విప్పుకొని ఎగురుతోందని. అణువణువు గురించి తెల్సుకోవాలని మీకు ఉంది కదూ !
అవునా ! ! నిజమేనా ?
ఏంటి అంత సీక్రెట్ లవ్ షకీలా జీవితంలో ? అస్సలు ఎవరీ షకీలా ? ఏంటి నిజంగా అన్ని సీక్రెట్స్ ఉన్నాయా ఆమె జీవితంలో ? అస్సలామె ఎలా ఇంతగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది ?
ఈ సందేహాలన్నీ మీ మనస్సుని ఊపేస్తున్నాయి కదూ!
మీ సందేహాలన్నింటికీ సమాధానం నాదగ్గరుంది. నాతో రండి ..షకీలా ప్రేమ గురించి,,,ఆమె జీవితం గురించి,,ఆమె సినిమాల గురించి చాలా మందికి తెలియని ఆ సీక్రెట్స్ గురించి మనమిప్పుడు తెల్సుకుందాం
షకీల అనగానే దక్షిణ సినిమా ఇండస్టీలో ఒక నటి అని, మాజీ హాట్ మోడల్ అనీ చెప్పుకోవటం కంటే కూడా ఒక ” ఒక అశ్లీల చిత్రాల నటి ” గానే ఎక్కువ మనకు పరిచయం కదా !
షకీలా తన యుక్తవయస్సునుండే ప్రేమ కథ నడిపింది. కానీ ఆమె తల్లి ఆమెను కుటుంబ పరిస్థితులరీత్య వ్యభిచారంలోకి బలవంతంగా దింపాలని చూసింది.
మనందరికీ తెల్సి షకీలా అంటే రెండు దశాబ్ధాలుగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంగా ఏలిన శృంగార చిత్రాల కధానాయకి ..ఇంకో మాటలో చెప్పాలంటే ” అశ్లీల చిత్రాల కథానాయకి ”’ గానే మనకి సుపరిచితం.
ఇప్పటివరకూ అందిన కధనాలప్రకారం రిచాచద్దా ” షకీలా ” పాత్రకు ఎంపిక కాబడింది. ఈ చిత్రాన్ని రూపొందించటానికి నిర్మాతలు ,దర్శకులు ఎంతో ఆశక్తిగా…ఉత్సాహంగా ..ఆతృతగా ఉన్నారు.
అస్సలు షకీలా ఎవరు ????
షకీలా ఒక మాజీ హాట్ మోడలే కాక భారత చలన చిత్ర నటి. ఆమె చెన్నైలోని కోడంబాకంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది.
ఆమె తన ఆరుగురు తోబుట్టువులతో తన బాల్యాన్నీ, తన విద్యాభ్యాసాన్ని గడిపింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఆమె బ్రైట్ స్టూడెంట్ కాని కారణంగా ఆమె ఆరు స్కూల్స్ మారవల్సి వచ్చింది.
షకీలా పేదరికం మధ్యే పెరిగింది. ఆమె సినిమా నటిగా పూర్తిగా పేరుపొందకముందే 1990 సంవత్సరం లోనే బాల్యనటిగా చలనచిత్రరంగానికి పరిచయమైంది. ఇదే ఆమెకి తన 20 వ సంవత్సరంల వయస్సులో నటనాజీవితానికి తొలిమెట్టైంది. మెల్లమెల్లగా సినిమారంగం పూర్తిగా ఆమె జీవితాన్నే మార్చేసింది.
మొట్టమొదటిగా 1995 లో ” ప్లే గర్ల్స్ ” అనే చిత్రం ద్వారా సహాయనటిగా ఆమె దక్షిణ సినీరంగంలో సినీజీవితానికి శ్రీకారం చుట్టింది.
1990 నుండి 2000 వరకూ షకీలా దాదాపు 250 పైగా చిత్రాలు నటించింది .వాటిలో ఎక్కువశాతం అశ్లీలచిత్రాలే ఉండటం కొసమెరుపు.
ఆమె మళయాలంలో నటించిన ”’ కిన్నెరతుంబికళ్” సూపర్ హిట్ అయ్యి ప్రేక్షకుల మధిలో ఆమె ఒక సెక్స్ సింబల్ గా తనదైన ముద్రవేసుకుంది.
ఆమె అశ్లీల చిత్రాలు దాదాపు అన్ని భారతీయ భాషల్లో డబ్బింగ్ చేయబడి జనాల్లో గొప్ప పాపులారిటీ సంపాదించుకుంది. స్వదేశీయులేకాక విదేశీయులు కూడా ఈ సినిమాలను ఆదరించటం చెప్పుకోదగ్గ విశేషం.
ఆమె చిత్రాలు విదేశీభాషలైన నెపాలీస్,చైనీస్ భాషల్లో తర్జుమా చేయబడటమే కాకుండా ఆమె బాడీ మార్ఫింగ్ కూడా చేయబడిందని షకీలాకు ఆయా సినిమాల రిలీజ్ అనంతరం తెల్సి దిగ్బ్రాంతి చెందింది. ఈ చిత్రాల్లో ఆమెకి లీడ్ రోల్ ఇవ్వకుండా బాడీ షకీలాదీ తల పేరుగాంచిన హీరోయిన్స్ ది పెట్టి దర్శకులు రూపొందించటం చూసి ఆమె ఆవాక్కైంది.
షకీలా ఇలాంటి అశ్లీలచిత్రాలలో ఎక్కువకాలం నటించటం తనకు ఇష్టంలేదని తన మనస్సులోని అయిష్టతను ఆమె రాసిన ఆత్మకథలో పేర్కొంది.
ఆమె తన జీవితంలో ఎదురైన తీపి,చేదు జ్ఞాపకాలను ఇలా పంచుకుంది…
*ఆమె తన 23వ ఏటనే తండ్రిని కోల్పోయింది.
*ఆమె తన పేదరికం వలనే ఆశ్లీలచిత్రాల నటనావకాశాలకు ” చెయ్యను ”’ అని చెప్పలేని అశక్తతకు లోనయ్యింది. ఆమె తల్లి అసభ్యచిత్రాలు అని తెల్సినప్పటికీ చెయ్యాల్సిందేనని ప్రేరేపించేది.
*తన కుటుంబ బాధ్యతలవలననే షకీలా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోవాలని నిర్ణయించుకుంది.
*ఆమె ఎప్పుడూ తను నటించిన సినిమాలను థియేటర్ లో చూడలేదు.
షకీలాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ?????
ఈ ప్రపంచంలో ఎవ్వరూకూడా తమకంటూ జీవితంలో ఒక తోడూ నీడా ఉండాలని కోరుకోని వారుండరు. అలాగే షకీలా కూడా తనదైన కుటుంబజీవితం పొందాలనుకుంది. కానీ ఆమె తల్లే ఆమెపాలిట శతృవై షకీలా తలరాతని పాడుచేసింది.
కారణం మరేదో కాదు వారి పేదరికమే వారిపాలిట శాపంగా మారింది .ఆ సమయంలో కుటుంబానికి ,తోబుట్టువులకూ ఒక్క షకీలానే ఆదాయవనరు. అందువలనే షకీలా తల్లే పరిస్థితులకు బానిసై షకీలాకు వచ్చిన సంభంధాలను చెడగొట్టేసింది.
ఈ మన విధివంచితురాలు షకీలా అశ్లీలచిత్రాలలో నటిస్తున్నప్పటికీ మనసా,వాచా,కర్మణా నమ్మి ప్రేమించి ఆమెతోనే తనజీవితం అనుకున్న ఒక నేస్తం ఉండేవాడు షకీలాకు.
కానీ ఇందుకు ఆమె తల్లి ఒప్పుకోలేదు..ఇక్కడ ఒక విషయం ఉధ్ఘాటించాలి.
షకీలా తన యుక్తవయస్సునుండే అతనితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో కొనసాగించింది.
అతనితోనే తన కోరికల సౌధాన్ని నిర్మించుకునేదేమో కానీ రాను రానూ పరిస్థితులకు విరక్తి చెంది తనంతటతానే తన ఆకాశహర్మ్యాలను కూలదోసుకొని తన కలలకు స్వస్థిపలికి ఇప్పుడిలా ఒంటరిగా…ఏకాకిలా మిగిలిపోయింది మన షకీల.
భాధగా ఉంది కదూ…సరె.సరే…ఇప్పుడిక …
షకీలా ప్రేమ…జీవితం…సినిమాలు..తదితర వివరాలు మీతో పంచుకోవటం కోసం ఎదురుచూస్తున్నాయి.
షకీలా ముఖ్యంగా ఎదుర్కున్న 5 వివాదాలు…
ఒక అశ్లీలచిత్రాల నటిపై ఇలాంటి వివాదాలుండటం సహజపరిణామమే..
*షకీల ముస్లిం కుటుంబ నేపధ్య యువతి అయినందున ఆమె ఎంతటి విధివంచితురాలో తెలుస్తున్నప్పటికీ ఆమెను ఒక సిగ్గులేని యువతిగా ముద్రవేసింది ముస్లిం సమాజం.
*మీడియాతో సహా ఆమెతో కల్సి పనిచేసే సహనటులు కూడా ఆమె శరీరసౌష్టవాన్ని చూసి ఫ్యాట్ అని పిలుస్తూ గేళిచేసేవారు.