మనం ఆదరించినట్టు వాళ్ళు ఎందుకు ఆదరించట్లేదు…. తమిళ ప్రజలపై తెలుగు వాళ్ళు ఫైర్?…ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీలకు తెలుసు. అయితే ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీ అన్ని వర్గాల అన్ని ఇండస్ట్రీలను ఆహ్వానిస్తూ అందరినీ కలుపుకుంటూ పోతుంది. తమిళ ప్రజలు మాత్రం మనల్ని ఆస్వాదించలేకపోతున్నారు. రేపు రిలీజ్ అయ్యే దేవర మూవీకి ఎక్కువగా స్క్రీన్స్ ఇవ్వడానికి కూడా ఎగ్జిబిటర్లు మొగ్గు చూపట్లేదు. ఇది ఎప్పటినుంచో కొనసాగుతుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ తమిళ హీరోలైన సూర్య, కమలహాసన్, కార్తీ, శివ కార్తికేయన్, విశాల్,విజయ్, రజనీకాంత్, విక్రమ్ వంటి హీరోలకు మన తెలుగులో అత్యధికంగా ప్రజాదారణ దక్కుతుంది. అలాగే తమిళ్ హీరోలు నటించిన సినిమాలకు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువగా ధియేటర్లు దొరుకుతాయి. కానీ మన తెలుగు హీరోల సినిమాలకు మాత్రం తమిళలో ఎక్కువగా థియేటర్లో విడుదల చేయడానికి మొగ్గు చూపట్లేదు. అయితే దాని కారణం ఏంటో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం దేవర సినిమా కన్నా కార్తీ సినిమాకి మాత్రం ఎక్కువగా థియేటర్లనేవి కేటాయించారు. కానీ దేవర మూవీ ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సరే అతి తక్కువ స్క్రీన్స్ లోనే విడుదల చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో తమిళ ప్రజలపై అలాగే ఎగ్జిబిటర్ల పై టాలీవుడ్ సినీ రంగ ప్రియులు అలాగే ప్రజలు కూడా మండిపడుతున్నారు. దానికి కారణం మన తెలుగు సినిమాకి అతి తక్కువ స్క్రీన్స్ అనేవి ఇవ్వడం వల్ల. ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి మన టాలీవుడ్ లో రిలీజ్ అయ్యే సినిమాలకి ఇలానే జరుగుతుంది. కానీ ఇప్పటికీ మన తెలుగు ప్రజలు మాత్రం తమిళ మూవీస్‌కి ఎక్కువ థియేటర్ ఇస్తున్నారు.