చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్య మరోసారి పోటీ…. ఇద్దరు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యేనా..మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మరియు చిరంజీవి అంటే తెలియని వాళ్లు ఉండరు. ఒకరేమో మాస్ గా పేరుందినవారు. ఇంకొకరేమో కష్టపడి పైకి వచ్చిన వారు.
తెలుగు వారి రుచికరమైన సాంప్రదాయ కేటరింగ్ సర్వీస్ కోసం చూస్తున్నారా…అయితే ఒక CLICK
ఎన్నో ఏళ్లుగా ఎన్టీఆర్ కొడుకుగా వచ్చిన బాలకృష్ణ ఎన్నో రికార్డులు సృష్టించాడు. మరోపక్క చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ ఎన్నో కష్టాలను అనుభవించి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాడు. ఇద్దరి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఉన్న టాలీవుడ్ కి ఈ ఇద్దరే పెద్దదిక్కుగా చెప్పుకుంటారు. అంతలా సినిమా ఇండస్ట్రీ ని వీళ్ళు ఎలుతున్నారు అంటే షాకింగ్ కి గరికవాల్సినక్కర్లేదు. చిరంజీవి ఒకప్పుడు ప్రజా రాజ్యం పేరిట పార్టీ ని నడపకముందు వీరిద్దరు చాలా సార్లు తన సినిమా లని ఒకేసారి రిలీజ్ చేసి గట్టి పోటీ నీ ఇచ్చేవారు. దాని తరువాత వాళ్లిద్దరు కలిసి 2 సార్లు ఒకేసారి వాళ్ళ యొక్క సినిమాలను రిలీజ్ చేసారు. అందులో ఇద్దరు సూపర్ హిట్స్ ని ఎందుకున్నారు. ఇపుడు మళ్ళీ అలానే వాళ్లిద్దదరు కలసి సంక్రాంతి సందర్బంగా ఫాన్స్ కి మంచి విందు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు.
చిరంజీవి ఇంతకముందే సంక్రాతికి తన సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికే నిర్మాతలు చెప్పారు. మరోపక్క బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు అట. విశ్వంబర మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 తారీఖున విడుదల చేసేలా మూవీ బృందం ఏర్పాటు చేసారు. బాలకృష్ణ సినిమా కూడా అప్పుడే విడుదల చేసి ఫాన్స్ కి మంచి థ్రిల్లింగ్ ఇవ్వాలని అనుకుంటున్నారు అట. ఇలా కనుక జరిగితే ఫాన్స్ కి ఇక పండగే అని చెప్పాలి. అయితే ఇలాంటి టైం లో ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం ఉందని కొంతమంది ప్రముఖులు అంటున్నారు. కానీ ఇదంతా జరగదు అని కొంతమంది ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని వీళ్ళు ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారని.. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టారు అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఏదైతేనేం ఇలా కనుక ఒకేసారి వీళ్లిద్దరు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లలో ఇక పండగే అని సినీ ప్రియులు అంటున్నారు. చూద్దాం మరి ఒకేరోజు వీరిద్దరు సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో అనేది సంక్రాంతి దాకా వేచి ఉండాల్సిందే.