ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చేయను – శ్రీ లీల

Stars

ఎంత డబ్బు ఇచ్చినా సరే….సినిమా లైన వదులుకుంటా గాని ఆ పని మాత్రం చచ్చినా చేయను… : హీరోయిన్ శ్రీ లీల…మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీల అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ని ఏలిందంటే అందులో అతిశయోక్తి లేదు. చిన్న హీరోల నుండి ఏకంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల దగ్గర దాకా అందరితో నటించింది ఈ హీరోయిన్. మొన్నటిదాకా టాలీవుడ్ ఐరన్ లెగ్ అని కూడా తనని పిలిచారు. ఎంత వేగంగా సినిమా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే వేగంగా ఈమధ్య పడిపోతుంది. రెండు సంవత్సరాల క్రితం పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ముందుకి వచ్చి సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. తన నటనతో, డాన్సులతో టాలీవుడ్ నీ ఒక ఊపు ఊపింది. సినీ ప్రియులకు చాలా బాగా ఈ డాన్స్ మరియు నటన నచ్చాయి.

Best Catering Services in Telugu States

రెండు సంవత్సరాల నుండి సినిమాలలోనటిస్తూ చాలా బిజీగా ఉండేది. మొన్నటిదాకా బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ బాగానే వచ్చాయి. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించి తను నటనతో మెప్పించిన సరే సినిమా యావరేజ్ గా నిలిచింది. అలాగే నితిన్ తో కలిసి నటించిన సినిమా డిజాస్టర్ అవడం అలాగే వైష్ణవి తేజ్తో కలిసి నటించిన సినిమా కూడా డిజాస్టర్ అవడంతో తనకి సినిమా అవకాశాలు అనేవి తగ్గిపోయాయి. ఇప్పుడు కొద్దిగా గొప్ప బాలీవుడ్ నుండి మరియు టాలీవుడ్ నుండి సినీ అవకాశాలు ఉన్నా సరే అవి అంతంత మాత్రమే. రెండు సంవత్సరాల క్రితం చేతులో ఎన్నో సినిమాలు ఉన్న శ్రీ లీలకి ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ సినిమాలు తన చేతిలో లేకపోవడంతో శ్రీ లీల ఫాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈమధ్య శ్రీ లీలకి ఐటెం సాంగ్స్ చేయమని అటు టాలీవుడ్ నుండి ఇటు బాలీవుడ్ నుండి తెగ ఆఫర్స్ వస్తున్నాయంట. అయితే తన కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని ఐటెం సాంగ్స్ నేనైతే చేయను అని చెప్పి మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేస్తుంది అంట.

ASTROLOGY SERVICES ASTROLOGERS IN YOUR CITY

ఇలా ఐటెం సాంగ్స్ చేయడం సినిమాలో హీరోయిన్ అవకాశాలు తగ్గుతాయని ఒక్కోసారి హీరోయిన్గా అవకాశాలు అయిపోతాయని శ్రీ లీల చెప్పుకొచ్చారు. జీవితంలో ఏప్పుడు కూడా హీరోయిన్ గానే కొనసాగుతానని ఎంత డబ్బు ఇచ్చినా,రిక్వెస్ట్ చేసినా సరే నేను అయితే ఐటెం సాంగ్స్ కి రెడీగా లేను అని చెప్పుకొచ్చింది. వరుస యావరేజ్ సినిమాలతో దూసుకుపోతున్న శ్రీ లీల తన రాబోయే సినిమా లో పవన్ కళ్యాణ్ తో నటించే సినిమా లో అయినా హిట్ కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే.