Gullyboy Riyaz

Talenters

జబర్దస్త్ రియాజ్ పొట్టొడే !… కానీ అతని గురించి తెలిస్తే గొప్పోడే అంటారు?….జబర్దస్త్ లో నటించేటువంటి గల్లీ బాయ్ రియాజ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇతను పొట్టిగా ఉంటాడు కానీ అతను వేసే పంచులు రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పేలుతాయి. అతని పంచులకు ప్రతి ఒక్కరూ నవ్వాల్సిందే. ఈ రియాజ్ అనే వ్యక్తి పుట్టి వాడే అయినా కానీ మనసు మాత్రం చాలా మంచిదని అతని జీవితం చెప్తుంది. జబర్దస్త్ అనే షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రియాజ్ పరిచయమయ్యాడు. ఇక అక్కడి నుండి బొమ్మ అదిరింది అలాగే అదిరింది షోలతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక అక్కడినుండి అతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే అతను ఇక ఈ షోల ద్వారా అతనికి పాపులారిటీ పెరగడంతో పాటుగా బాగానే సంపాదించడం ప్రారంభించాడు. 

 ఇతని యాక్టింగ్ కి తాజాగా హీరో నాని నటించినటువంటి దసరా సినిమాలో ఒక రోల్ ఇవ్వడం జరిగింది. అందులో రియాజ్ అతని యాక్టింగ్ తో ప్రజలందరినీ మైమరిపించాడు. రియాజ్ యాక్టింగ్ మరియు కామెడీతోనే కాకుండా ఈ మధ్య నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నాడు. ఇటీవలే ఈ కమెడియన్ రియాజ్ ఓ ఇంటి వాడు అయ్యాడు. తొలిసారి కలిసి ఓ షోలో కూడా తన భార్యని అందరికీ పరిచయం చేశాడు. భార్యను స్టేజ్ పై పరిచయం చేస్తూ ఉన్న సందర్భంలో రియాజ్ తెగ సంబరపడిపోయాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా అప్పట్లో బాగానే వైరల్ అయింది. ఇక ఈ స్టేజ్ పైనే కాసేపు కామెడీతో అలరించిన రియాజ్ తన భార్య యాస్మిన్ ఆ స్టేజ్ పైనే ఇద్దరు కూడా దండలు మార్చుకున్నారు. వీళ్ళిద్దరి వల్లే ఆ ఎపిసోడ్ కు కొత్త కళ వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

 కాగా రియాజ్ మొదట్లో ఓ మధ్య తరగతి కుటుంబం నుండి పెరిగాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన యాక్టింగ్ తో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడు. అయితే ఇతని స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా. కానీ ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉంటున్నాడు. ఇతను ఒక ముస్లిం వ్యక్తి. కమెడియన్ గా అలాగే యాక్టర్ గా తెలుగు రాష్ట్రాలలో మంచి పేరుతో పాటు గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో సోషల్ మీడియాలో తన వీడియోలతో ఆకట్టుకుంటూ అందరికీ పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత జబర్దస్త్ షోలో కొద్ది రోజులు పని చేశాడు. ఇక ఆ తరువాత సద్దాం గల్లీ బాయ్స్ టీమ్ లో ఒక వ్యక్తిగా చేరి అదిరింది అనే షోలో ఎంట్రీ ఇచ్చి తన కామెడీతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రియాజ్ అనే వ్యక్తి గతంలోనూ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఇమిటేట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాడు. ఇక దీంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు జగన్ అభిమానులు రియాజ్ ఫైర్ అవడంతో సోషల్ మీడియా వేదికగా రియాజ్ క్షమాపణలు చెప్పాడు. ఇక ఇంతటితో ఆ వివాదం అనేది ఆగిపోయింది. ఇక ఆ తరువాత నాని నటించినటువంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీ దసరా సినిమాలో ఒకే ఒక పాత్ర పోషించి తన యాక్టింగ్ తో అందరినీ మళ్లీ ఒకసారి మైమరిపించాడు. కాగా ప్రస్తుతం కమెడియన్ గా అలాగే యాక్టర్ గా పలు టీవీ షోలలో అలాగే వెబ్ సిరీస్ లలో మరియు సినిమా రంగంలో రాణిస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూనే నెమలి రాజుతో కలిసి యూట్యూబ్లో పలు వీడియోలు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు. 

 అయితే రియాజ్ పొట్టిగా ఉండడంతో చిన్నప్పటినుంచి చాలామంది అతనిని ఏడిపించేవారు. కానీ పొట్టితనం తన జీవితానికి అడ్డు రాకూడదనే నెపంతో ఎలాగైనా జీవితంలో స్థిరపడాలని ఆలోచనతో తన యాక్టింగ్ ని అలాగే కామెడీ నమ్ముకుని ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడు. ఇలా రియాజ్ ఎదగడానికి తన తల్లిదండ్రులు కూడా చాలా వరకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ నెలకి కొన్ని వేలల్లో డబ్బులు సంపాదిస్తున్నాడు. జీవితానికి సరిపడా డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. పొట్టివాడే గానీ జీవితంతో గురించి అన్ని తెలిసిన వ్యక్తిగా రియాజ్ జీవితంలో ముందుకు వెళుతున్నాడు. అయితే ఇతని వయసు ఎంత ఉంటుందనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు. కానీ ఏది ఏమైనా సరే పొట్టివాడని లేకుండా వయసు అనేది తెలియకుండా రెండు తెలుగు రాష్ట్రాలను తన కామెడీతో కట్టిపడేస్తున్నాడు.

అన్ని రకాల సేవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి