కూటమి గెలుపే…. మన పల్నాడు అభివృద్ధికి నాంది

Andhra Pradesh Political

ఎన్నికలలో బిజెపి,టిడిపి టిడిపి,జనసేన కూటమిని ఆదరించి భారీ మెజార్టీతో మనం గెలిపించుకుంటేనే మనకు ఉన్నటువంటి త్రాగునీరు , వ్యవసాయం, రోడ్లు వంటివి అనేకమైన అభివృద్ధితో పాటు ఎన్ని సమస్యలున్నా సరే ఓటమి గెలుపు ద్వారా తీరుతాయని టిడిపి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గురజాల నియోజకవర్గం మాచవరం గ్రామంలో నిర్వహించిన కూటమి కార్యక్రమంలో పాల్గొని అన్నారు. కృష్ణా నది ప్రాజెక్టును నిండితే నీరు దిగువకు వస్తుందని అప్పుడు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తగా ని చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించారన్నారు. మన గురజాల నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసి నియోజకవర్గంలోని ప్రతి వ్యవసాయదారుడు కి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మాచర్ల మరియు చిలకలూరిపేట ఇలా పల్నాడు లోని చాలా చోట్ల త్రాగునీరు సమస్య ఉందని నా దృష్టికి వచ్చింది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల యొక్క అన్ని సమస్యలు తీరుస్తానని అన్నారు. అలాగే పల్నాడు జిల్లాలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది దీనిని నేను అధికారంలోకి రాగానే పూర్తిగా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని అన్నారు. అలాగే మన కూటమి అయినటువంటి జనసేన,టిడిపి, బిజెపి పై వైకాపా ప్రభుత్వం చేస్తున్నారు దీన్ని ప్రజలు గుర్తించాలని కృష్ణదేవరాయలు అన్నారు. వైకాపా ప్రభుత్వం 20 ఏళ్లు కాదు ఈ ఐదేళ్లు మాత్రమే వచ్చే 20 ఏళ్లు మన చంద్రబాబు అని ఎన్ డి ఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు.