మంచు ప్యామిలీ లో మంటలు

అవీ ఇవీ

మంచు ఫ్యామిలీలో గొడవలు దేనికి మొదలయ్యాయి?… అసలు కారణాలేంటి? మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు మరియు మనోజ్ మధ్య వివాదం అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ గా నిలిచాయి. సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి మోహన్ బాబు మరియు మంచు మనోజ్ తండ్రి, కొడుకులు. అలాంటిది వీరిద్దరూ ప్రస్తుతం బద్ధ శత్రువులుగా మారిపోయినట్లు తెలుస్తుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకుంటున్నారు. కాగా గత మూడు రోజుల నుండి మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంటుంది. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు రచయిత నేపథ్యంలో అసలు తప్పు ఎవరిది.. ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయని చర్చ అందరిలోనూ మొదలైంది. అయితే మోహన్ మంచు మనోజ్ కన్నా విష్ణు నే చాలా బాగా చూసుకుంటున్నాడని అన్నిట్లోనూ మంచు మనోజ్ కు తక్కువ మనిషిగా చూస్తున్నాడని వాదన ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొంది. మొదట్లో విష్ణు సినిమా డెబ్యూ మూవీకి 30 కోట్లు ఖర్చు చేసిన మోహన్ బాబు మంచు మనోజ్ మూవీ కి మాత్రం చాలా తక్కువ ధరకే లంచ్ చేశారు. ఇక ఆదాయం మొత్తం విష్ణు కోసమే మోహన్ బాబు ఖర్చు చేస్తున్నాడు. రాజాగా 100 కోట్లు పెట్టి కన్నప్ప అనే పాన్ ఇండియా మూవీ కూడా విష్ణు చేతుల మీదుగానే చేస్తున్నారు మోహన్ బాబు. ఇక మోహన్ బాబు అలాగే మంచు ఫ్యామిలీకి అత్యధిక ఆదాయ వనరుగా ఉన్నటువంటి తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. దానిపై పూర్తి ఆధిపత్యం మోహన్ బాబు విష్ణు కి అందజేశాడు. మనోజ్ కి ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో అందరూ కూడా మోహన్ బాబు పై మండిపడుతున్నారు. కన్న కొడుకుల్ని ఇద్దరిని కూడా వేరువేరుగా చూడడం ముఖ్య కారణంగా భావిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు పై గురువుగా ఉండడంతో ఆమె ముంబైకి షిఫ్ట్ అయింది. కాబట్టి మనోజ్ కు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా మోహన్ బాబుది తప్పని తేల్చి చెప్తున్నారు. కాబట్టి కుటుంబా అంతర్గత విషయాలు ఎవరికీ తెలియవు కానీ ఇవి మాత్రం అందరికీ తెలుస్తున్నాయి. ఇక తాజాగా మనోజ్ వీడియో వేదిక కొన్ని మాటలు తెలియజేస్తుండగా మోహన్ బాబు మనోజ్ పై దాడికి దిగాడు. కెమెరామెన్ ను చితకబాదాడు మోహన్ బాబు. ఈ ఘటనలో కెమెరామెన్ కు అలాగే మంచు మనోజ్ కూడా గాయాలు అయ్యాయి. ఇప్పటికే ఈ విషయంపై మోహన్ బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి కూడా వివరం అందించింది. కానీ ఇప్పట్లో ఈ విషయం తేలేలా కనిపించట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. ఇద్దరు కూడా గాయాలయ్యాయని ఆస్పత్రికి వెళ్తున్నారు, ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు.. ఇలా వీరిద్దరు నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో హైలెట్గా నిలిచారు.

Thinking Marriage? Find Perfect Matrimony Service CLICK