Pithapuram Varma fire

Andhra Pradesh Political

సీట్ త్యాగం చేసి మరి ప్రచారం చేస్తుంటే … నన్నే అవమానిస్తారా : టిడిపి నేత వర్మ – ఏపీలో పిఠాపురం నియోజకవర్గం హైలెట్ గా నిలుస్తుంది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో మొదటి నుండి టిడిపి శ్రేణులకు నచ్చలేదు. కానీ చంద్రబాబుని వర్మ కలిశాక గొడవలు అనేవి సద్దుమణిగాయని అనుకున్నారు. అయినా గొడవలు ముదరడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి మరి వర్మ ఇంట్లో భోజనం చేసి ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కలిసి ప్రచారం సాగిస్తున్నారు. అయినప్పటికీ టిడిపి శ్రేణులు వర్మ సపోర్ట్ లేనిదే ఇక్కడ జనసేన గెలవలేదు అని పలు కామెంట్లు చేస్తున్నారు. కాపులు అధిక సంఖ్యలో ఉండటం వల్లే పవన్ కల్యాణ్ పిఠాపురంను ఎంచుకున్నారని తెలుస్తోంది. దాదాపు 70 వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గమే తనకు అనువైనదిగా పవన్ భావిస్తున్నారు.అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు పవన్ కల్యాణ్ గెలుపుకు కృషి చేస్తోన్న వర్మను జనసేన నాయకులు తీవ్రంగా అవమానించినట్టుగా తెలుస్తోంది. వర్మను ఎన్నికల ప్రచారంలో అవమానించడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీటు త్యాగం చేసి పవన్ కోసం ప్రచారం చేస్తుంటే..తమకు తగినే బుద్దే చెప్పారని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. పవన్ కల్యాణ్ గెలుపుకు కృషి చేస్తుంటే తమ నేతను అవమానించడం ఏంటని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మ వర్గీయులు అసభ్యపదజాలంతో జనసేన కార్యకర్తలను దూషించారు. దీంతో పిఠాపురంలో టీడీపీ , జనసేన రెండు వర్గాలు విడిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జనసేన అధినేత పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గం మొత్తం రాష్ట్రాన్ని ఆలోచనలలో పెడుతున్నట్లు అందరి దృష్టిలో ఒక హార్ట్ టాపిక్ గా మారిపోయింది.