ఈసారి యర్రగొండపాలెం లో టీడీపీ కి అనుకులమా?

Andhra Pradesh Political

ప్రకాశం జిల్లా, ఒంగోలు పార్లమెంట్,ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టిడిపి,జనసేన ముఖ్యంగా వినిపించే రాజకీయ పార్టీలు. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ మరియు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు ఉన్నారు. ఇక జనసేన విషయానికొస్తే ఈ నియోజకవర్గంలో అంతగా ఓటింగ్ లేకపోయినా టిడిపి జనసేన NDA కూటమిలో చేరడం వలన జనసేనకి కలిసొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి రాజకీయాలు ఉత్కంఠ భరితంగా ఉండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుండి దాదాపు ఎక్కువగా వైఎస్ఆర్సిపి గెలిచింది. కానీ ఈసారి వైఎస్ఆర్సిపి బలం తగ్గిపోయే అవకాశం ఉండడంతో టిడిపికి కలిసొచ్చే అదృష్టం వరించబోతుందన్న అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ముందుగానే తెలివితో డబ్బులకు లొంగకుండా మాకు ఎక్కువ ఎవరు సమస్యలు తీర్చుతారో వారికి మా ఓటు అన్న విధంగా ఉన్నారు.