ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఆది పురుష్ చిత్రంపై విమర్షలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్ర దర్శకుడు, ప్రొడ్యూసర్, మాటల రచయితపై అఖిల భారత హిందూ మహాసభ విమర్శలు కురిపించింది. ఆది పురుష్ సినిమా సనాతన ధర్మాన్ని ఘోరంగా అవమానించిందని ఆరోపించింది. రామాయణంలోని ముఖ్యమైన పాత్రలని సినిమాలో దిగజార్చారని, ఈ సనిమా కారణంగా రామాయణంపై అందరిలో తప్పుడు భావాలు ఏర్పడేందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని ఆరోపించింది. అందుకే ఈ సినిమాని నిషేధించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్‌లోని హజర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇక నేపాల్‌లో రాజధాని ఖాట్మండులో ఆదిపురుష్ సినిమాని నిషేధించాలని ఏకంగా భారతీయ చిత్రాలన్నింటినీ ఖాట్మండూలో నిషేధిస్తున్నట్లు కాఠ్మండూ మేయర్ బలెన్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. సీత నేపాల్ ప్రాంతంలో జన్మించగా ఆదిపురుష్ చిత్రంలో సీత భారత్‌లోనే జన్మించినట్లు చెప్పారని అందుకు నిరసనగా తాము ఈ చిత్రంతో పాటు భారతీయ చిత్రాలనే నిషేధిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. – Santosh Krishna