సంజయ్ దత్ గురించి తెలియనివారు ఎవరుంటారు ?బాలీవుడ్ దిగ్గజాల లో అతను ఒకరు . అతని జీవితం ఒక రోలర్ కోస్టర్ లాగా బోలెడన్ని ఎత్తు పల్లాలు వున్నాయి . అతని జీవితచరిత్ర ఆదారం గా రూపొందించిన “సంజూ” సినిమా బహుశా అంతా చూసేఉంటారు.
1981 లో నిర్మింపబడిన ”రాఖీ” సినిమా సంజయ్ దత్ కు ఒక సంచలనాన్ని విజయం ను అందించింది.
సంజయ్ స్వతహాగా బంగారుస్పూన్ తో పుట్టినప్పటికీ డ్రగ్స్ కీ, మరి కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు బానిసైయ్యాడు.
ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయం కాదుకానీ అతను అతి పిన్నవయస్సులోనే ఎన్నో ప్రేమవ్యవహారాలు నడిపాడు. అతనిపై ఆరోపింపబడ్డ ”ఆయుధాల కేస్ ” అతనిజీవితంలో పేర్కొనదగ్గ విషయమే అయినప్పటికీ ఇవేమీ అతని ప్రేమ జీవితాన్ని పాడుచేయలేకపోయాయి.
అయితే మీకు తెలుసా..అతని ప్రప్రముఖమైన ప్రేమ వ్యవహారాల గురించి ?…మీరంతా అతని ప్రేమ వ్యవహారాలు, ఈ పెళ్ళిళ్ళ గురించి తెల్సుకోవాలని ఆరాటపడుతున్నారా…అయితే ఇది చదవండి… మనం సంజయ్ దత్ ప్రేమ మరియు పెళ్ళి వ్యవహారాలగురించి చర్చించుకుందాం..సరేనా…
1.సంజయ్- మునిం లా ప్రేమాయణం…
సంజయ్ దత్ తొలిప్రేయసి ”టీనా మునిం ” సంజయ్ ,టీనా ఇద్దరు బాల్యస్నేహితులు. ఇద్దరి మనస్సులు ఆకర్షణకు లోనై వయస్సుకు వచ్చాక వారి ప్రేమ చిగురించింది. ఇద్దరిమధ్య విడదీయరాని భంధం ఏర్పడింది. ఆ సమయంలోనే సంజయ్ దత్ సినిమా ”రాఖీ ” విడుదలై సంచలనాన్ని సృష్టించింది. ఇంక అప్పటినుండి టీనా,సంజయ్ డేటింగ్ మొదలుపెట్టారు. అయినప్పటికీ సంజయ్ లెక్కలేనంతగా ఆల్కాహాల్ కి బానిసవటం వలన ఇద్దరిమధ్యా పొరపొచ్చాలు పెరిగి ఇద్దరూ మధ్య దూరం పెరిగింది.
2.సంజూ- రిచా లా ప్రేమ కథ:
తర్వాత సంజయ్ ఒక సినిమా ప్రారంభోత్సవ సమయంలో ”రిచాశర్మ ”ని కలవటం జరిగింది. మన సంజయ్ అయితే ఇంతకు ముందే ఒక మ్యాగజైన్ లో రిచాశర్మ ఫొటో చూసి ప్రేమలో పడ్డాడు. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సంజయ్ నానా తంటాలుపడి రిచా ఫోన్ నంబర్ సంపాదించి రిచాకు తరచూ ఫోన్ చేస్తూ తనతో డేట్ కి రావాల్సిందిగా కోరుతుండేవాడు..రిచామాత్రం రిజక్ట్ చేస్తూనే ఉండేది. ఇది ఇలా జరుగుతుండగా అదృష్టవశాత్తు అనుకోకుండా ఒకరోజు రిచా సంజయ్ తో డేట్ కి ఒప్పుకోవటం జరిగింది.ఇంక అప్పటినుండి వారిమధ్య ప్రేమ పుష్పించటం జరిగింది. ఊటీలో ”ఆగ్ హీ ఆగ్ ” షూటింగ్ టైంలో సంజయ్ తనను పెళ్ళిచేసుకోవల్సిందిగా రిచాను కోరటం జరిగింది. కొంత టైం తీసుకున్నప్పటికీ రిచా ఒప్పుకుంది. 1987 లో ఇద్దరికీ వివాహం జరిగింది .కాలక్రమేణా ఇద్దరి దాంపత్యఫలితంగా ”’త్రిషాల ” కు జన్మనివ్వటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రిచా అతి కొద్దికాలంలోనే ”బ్రెయిన్ ట్యూమర్ ” వచ్చి వైద్యసహాయం కోసం అమెరికా వెళ్ళింది. కానీ లాభంలేకపోయింది. 1996 డిసెంబర్ లో న్యూయార్క్ లోనే ఆ మహమ్మారి ట్యూమర్ రిచాను బలితీసుకుంది.
3. సంజూ – మాధురి దీక్షిత్ ప్రేమాయణం:
ఇంక మన సంజయ్ ముచ్చటగా నడిపిన మూడవ ప్రేమ మాధురీధీక్షిత్ తో. ఆరోజుల్లో 1990 లో సంజయ్ ,మాధురీల ప్రేమవిషయం పెద్దదుమారాన్నే రేపింది. 1991 లో ”’ సాజన్ ”’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ తరచూ దగ్గరగా ఉండటం వలన ఇద్దరిమధ్యా ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒకటౌదాము అనుకునే లోపే దురదృష్టం 1993 లో సంజయ్ ని ”’ టాడా కేస్ ”’ రూపంలో దురదృష్టం వెంటాడింది. సంజయ్ అరెస్ట్ అవ్వటంతో ఇద్దరిమధ్యా ఉన్న భంధం తెగిపోయింది. అయితే ఒకటీ ఇద్దరూ ఇటు సంజయ్ కానీ అటు మాధురీ కానీ వారిద్దరూ ప్రేమికులున్న విషయం ఏనాడూ ఒప్పుకోలేదు.
4. సంజూ – రియ లా ప్రేమ కథ:
ఇన్ని పరిణామాల నేపధ్యంలోనూ మన సంజయ్ లోని ప్రేమికుడు నిరుత్సాహపడలేదు. మాధురీతో వేరైనాక ”రియా పిళ్ళై ” తో తిరిగిప్రేమలో పడ్డాడు. కాకపోతే ఈసారిమాత్రం ఇద్దరూ తొలిచూపులోనే ఒకరికి ఒకరు మనస్సు ఇచ్చిపుచ్చుకున్నారు.1998 లో ఇద్దరూ వివాహభంధంతో ఒక్కటైనారు. కానీ ఈసారి కూడా సంజయ్ జీవితంలో ఈభంధం కూడా నిలవలేదు .ఇద్దరూ 2005 లో విడాకులు పుచ్చుకున్నారు. విడాకులు రాకముందునుండే ఇద్దరూ వేరేవారితో వివాహేతర సంభంధం సాగించారు.
5. సంజూ – మాన్యత లా ప్రేమాయణం:
ఇంక చివరికీ సంజయ్ ,మాన్యతాదత్ ల సంభంధం గురించి చెప్పాలంటే జన్మజన్మల సంభంధం అని చెప్పొచ్చు. అంత బాండింగ్ ఉండేది వారిద్దరి మధ్య. చూసిన మరుసెకనే ఇద్దరూ ఒకరిప్రేమలో ఒకరు పడిపోయారు. కానీ సంజయ్ సోదరికి సంజయ్ పెళ్ళి మాన్యతాతో జరగటం ఇష్టపడలేదు. ఎన్ని అవాంతరాలూ, అభ్యంతరాలు వచ్చినప్పటికీ సంజయ్ ప్రేమ ముందు నిలబడలేకపోయాయి. అన్నిటికీ ఎదురొడ్డి సంజయ్,మాన్యతా వివాహభంధంతో ఒక్కటయ్యారు. కోర్ట్ కేస్ జరుగుతున్నప్పటికీ ఇద్దరూ ఒకేమాట మీద ఉండి చివరికి 7 ఫిబ్రవరి,2008 లో వివాహంచేసుకున్నారు. వారి వివాహమైన రెండుసంవత్సరాలకి 21అక్టోబర్, 2010 లో సంజయ్ ,మాన్యాతలు ఇక్రాదత్, షారాన్ అనే కవలలకి జన్మనిచ్చారు.
సంజయ్ పట్ల తనకున్న ప్రేమనీ, తన మనస్సులోని భావాలను ఒకసారి మాన్యత ఇచ్చిన ఇంటర్యూలో ఇలా పేర్కొంది…..
”’ ఎక్కడైతే అపరిమితమైన శక్తి ఉంటుందో …అక్కడ …ఆశక్తి చుట్టూ ఎన్నో వలయాలు ఆవరించి ఉంటాయి. అయితే వాటిని ఎదుర్కొనగల ధీశాలి సంజయ్. అతన్నీ,అతని ఇమేజ్ ని వాడుకోవటానికి ఎంతోమంది అవకాశవాదులు ప్రయత్నించారు. నేను కేవలం ఒక ఢాలులా,ఒక అడ్డంకిలా సంజయ్ కీ ఆ అవకాశవాదులకూ మధ్య ఉండటంచేత సహజంగానే ఆ అవకాశవాదులు నన్ను ఇష్టపడలేదు ఇది సహజమేకదా !నేను వారు అనుకున్నవి సాగనివ్వలేదు కదండీ ”…