అల్లు అర్జున్ పై మెగా అభిమానులు ట్రోల్స్

Stars

అల్లు అర్జున్ గా శివాజీ….. థియేటర్లో అల్లు అర్జున్ పై మెగా అభిమానులు భారీ ట్రోల్స్…సోషల్ మీడియాలో ఈమధ్య అల్లు అర్జున్ పై చాలానే ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలబడకుండా అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికెళ్లిన దగ్గర నుంచి ఇప్పటిదాకా భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ మరియు మెగా అభిమానుల మధ్య వైరాలు మొదలయ్యాయి. ఈమధ్య రీ రిలీజ్ చేసిన ఇంద్ర మూవీకి భారీ ఎత్తున మెగా అభిమానులు థియేటర్ కి వచ్చి వీక్షించారు. అయితే ఇంద్ర మూవీ లోని ఒక సీన్ లో బిగ్ బాస్ శివాజీ చిరంజీవి కాళ్లు ముఖ్య సమయంలో.. శివాజీ ని అల్లు అర్జున్ గా ఊహించుకొని మెగా అభిమానులు “అల్లు అర్జున్ అల్లు అర్జున్” అంటూ భారీగా ట్రోల్స్ అనేవి చేశారు.

మంచి ఆస్ట్రాలజీ సర్వీస్ కోసం చూస్తున్నారా CLICK

ఈమధ్య మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.
అయితేఅసలు విషయం ఇక్కడే ఉంది. అల్లు అర్జున్ ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇష్టమైన వారి కోసం అలాగే నాకు నచ్చిన వారి కోసం నేను ఎంత దూరమైన వస్తా అన్న మాటలు ఎలక్షన్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన వాటికి లింక్ అవుతుండడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మాటలు వైరల్ గా మారాయి. మెగా అభిమానులలో చిచ్చు రేపింది. దీంతో మరోసారి అల్లు అర్జున్ పై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

దీంతో ఎక్కడపడితే అక్కడ అల్లు అర్జున్ పై ట్రోల్ చేస్తున్నారు. ఈమధ్య అల్లు అర్జున్ రోడ్లమీద ఒంటరిగా తిరుగుతున్న సమయంలో ఎవరూ తనని పట్టించుకోకపోవడం మెగా అభిమానులు ఆనందానికి గురి చేశాయి. అలాగే ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో శివాజీ చిరంజీవి కాలు పట్టుకుని ఉన్న సీన్ సమయంలో శివాజీ ని ‘alluarjun’ అనుకుని అల్లు అర్జున్ చిరంజీవి కాలు పట్టుకుంటున్నాడు అన్నట్లు థియేటర్ లోని మెగా అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు తెలియజేశారు. దీంతో ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ట్రోల్స్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారాలు రేకెత్తుతున్నాయి.