బడ్జెట్ ఏమో 100 కోట్లు!… భారం మొత్తం మోహన్ బాబు మీదే…టాలీవుడ్ లో అనేక సినిమాలు చేసిన విశిష్టత మోహన్ బాబు కి దక్కుతుంది. ఎందుకంటే ఆనాటి కాలంలోనే మోహన్ బాబు కొన్ని వందల సినిమాలు చేశారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కొడుకుల మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ఇద్దరు కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ వీరిద్దరికి కూడా మంచి గుర్తింపు అనేది రాలేదు. ఇక ప్రస్తుతం మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప అనే సినిమా చేస్తూ ఉన్నారు. కానీ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం అంతగా ఆశక్తి చూపెట్టలేదు. ఎందుకంటే మంచు విష్ణు ఈమధ్య చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్గా జిన్నా అనే మూవీకి కనీసం థియేటర్లో సరిగా బుకింగ్ కూడా కాలేదు. కానీ ఏకంగా ఇప్పుడు కన్నప్ప అనే సినిమాను 100 కోట్ల బడ్జెట్ను పెట్టి మరీ తీస్తున్నారు. కాబట్టి మోహన్ బాబు సొంతగా సినిమాని నిర్మించాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే భారీగానే లాభాలు అందుకోవచ్చు. కానీ పొరపాటున సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడకపోతే మాత్రం మోహన్ బాబు భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో ప్రభాస్ మరియు మోహన్ లాల్ నటిస్తుండగా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవ్వనుంది.