పెళ్ళికాని ప్రసాద్ మూవీ టీజర్ – టాలీవుడ్ top కమెడియన్ లో ఒకరైన సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం “పెళ్లి కాని ప్రసాద్”. ఈ సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అభిలాష్ రెడ్డి దర్శనత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవై బాబు మరియు భాను ప్రకాష్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 21న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను నటుడు ప్రభాస్ విడుదల చేయగా… పెళ్లి కోసం హీరో ఏం చేశాడు?.. కట్నం తీసుకోకుండా అతను పెళ్లి చేసుకున్నాడా లేదా అనే అంశాలతో ఈ సినిమా కామెడీగా ఉంటుంది. ఇందులో” ప్రసాద్ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాతా ముత్తాతలు ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా” అంటూ కమెడియన్ సప్తగిరి చెప్పే సంభాషణలు ప్రేక్షకులను నవ్వులు పూయించేలా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా టీజర్ అయితే చాలా కామెడీగా ఉంటుంది. సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లికాని ప్రసాద్ సినిమా టీజర్ వైరల్ అవుతుంది.
