దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు… మూవీ యూనిట్ మరియు ఫాన్స్ రియాక్షన్ ఏంటి…? ఈ దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవడం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవ్వడం నాకు ఎంతో బాధాకర విషయం అని చెప్పుకొచ్చాడు. దాంతోపాటుగా ఈ సినిమా రిలీజ్ అవ్వడం మీ కంటే కూడా నాకే ఎక్కువగా బాధను కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్ లో మీకు ఎన్నో రకాలుగా ఈ సినిమా గురించి అలాగే ఈ సినిమా వెనుక మేము పడిన కష్టం గురించి ఎన్నో విధాలుగా మీకు చెప్పదలుచుకున్నాను. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల దీన్ని నిర్వహించలేకపోయారు. మీ ప్రేమకి ఆప్యాయతకి నేను కృతజ్ఞుడిని అని జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఈవెంట్ రద్దు అవడంపై దేవర మూవీ హీరోయిన్ జాన్వి కపూర్ కూడా ఎంతగానో తన మనసులోని మాటలను బయటకు చెప్పుకొచ్చింది. నా మీద చూపిస్తున్న మీ ప్రేమకి నా హృదయపూర్వక వందనాలు అని ఆమె చెప్పుకొచ్చారు. ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఇలా ఈవెంట్ రద్దు అవడం నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది అని ఎంతగానో ఆమె కూడా బాధపడిన వీడియోని కూడా రిలీజ్ చేశారు.
అలాగే ఈ సినిమాలో నటించినటువంటి నటులు అలాగే సినిమా నిర్ణయించిన మీడియా సంస్థ కూడా కొన్ని నివారే కారణాలు రద్దు అవుతున్న విషయం ముందుగానే వెల్లడించింది. అయితే ఈ దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవడం ఫ్యాన్స్ కి భారీగానే షాక్ ఇచ్చింది. దాంతో పాటుగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. అంతేకాకుండా మేము ఎన్నో కిలోమీటర్లు దాటుకొని ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వస్తే మమ్మల్ని తన్ని తరిమేసారని ఎంతో వాపోయారు. అయితే ఫ్యాన్స్ మాత్రం చాలా మైళ్ళ దూరం నుంచి వచ్చి మా అభిమాన నటుడు ఎన్టీఆర్ ని చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాము కానీ అవి కుదరలేదని మీడియాలకు తమ వాదనలు చెప్పుకుంటూ వెన్నుతిరిగారు. దాంతో అందరూ ఒక్కసారిగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కాబట్టి ఏదైనా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఆ సినిమా హీరో స్థాయిని బట్టి పెట్టుకోవాలని ఎన్నో కిలోమీటర్ల దూరం దాటుకుని వచ్చిన మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత నిరాశను మిగిల్చడం సరికాదని ఫ్యాన్స్ సినీ వర్గాలకు హెచ్చరికలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమి చిన్న హీరో కాదు అలాంటి స్థాయి ఉన్న హీరోకి ఇలాంటి హాల్స్ బుక్ చేస్తే ఇలానే ఉంటుందని కాబట్టి ఏదైనా ఓపెన్ ప్లేస్ లలో ఇలాంటి ఈవెంట్లను నిర్వహిస్తే ఎక్కువ మోతాదులు ప్రజలు అలాగే ఫ్యాన్స్ వచ్చి వీక్షించేందుకు సులభంగా ఉంటుందని ఎంతో మంది ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇంట్లో ఎన్ని తిట్లు తింటున్నా సరే ఎంత దూరం వచ్చి మరి ఈవెంట్ కి హాజరవుతున్నామని కానీ ఇలా సడన్గా రద్దవడం మేం జీర్ణించుకోలేకపోతున్నామని చాలా మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.