ఫిబ్రవరిలో సినిమాల జాతర!…

Cinema

2025 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజు, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నామని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇందులో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబెట్టింది. ఇక డాకు మహారాజు విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఇక ర శంకర్ డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు భారీ దెబ్బ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్డి ప్రింట్ లీక్ అవడం. అలాగే సినిమా ప్రేక్షకుల నుండి విమర్శలు పొందడం వల్ల బాక్సాఫీస్ వద్ద అత్తరు ఫ్లాప్ అయింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీయగా కేవలం 250 కోట్లు మాత్రమే రావడం వల్ల నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. 

 ఇక ఫిబ్రవరి నెలలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నాయి. ఇక ఫిబ్రవరి నెలలో మొదటగా థియేటర్లకు అడుగుపెట్టబోయే సినిమా అజిత్ అనువాద చిత్రం పట్టుదల. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తిని పెంచేలా ఉండడంతో తెలుగులోను దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఫిబ్రవరి 6వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

 ఇక మన టాలీవుడ్ హీరో నాగచైతన్య మరియు సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న సినిమా తండెల్. వాస్తవ ఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి తరిగెక్కించిన ఈ సినిమా గురించి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో నాగచైతన్య ఉత్తరాంధ్ర భాషతో మరియు బుజ్జి తల్లి పాత్రలో సాయి పల్లవి నటనకి కూడా మంచిగా రెస్పాన్స్ వస్తుంది. నాగచైతన్య మరియు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ఆకర్షణగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఈనెల ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఎంత మాత్రం సక్సెస్ అందుకుంటుందో మనం ఫిబ్రవరి 7 తారీఖు వరకు వేచి చూడాల్సిందే. 

 ఇక ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు దినంగా బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. విశ్వక్సేన్ నటిస్తున్నటువంటి లైలా సినిమా, హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్నటువంటి దిల్ రూబ, రాజా గౌతమ్ మరియు బ్రహ్మానందం కలిసి నటించిన బ్రహ్మ ఆనందం అనే ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. లైలా సినిమాకు రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు . కాగా ఈ సినిమాలో విశ్వక్ అమ్మాయిగా కనిపించబోతున్నాడు. 

 ఇక తరువాత మజాకా అనే సినిమాతో సినీ ప్రియులను నవ్వించేందుకు సందీప్ కిషన్ సిద్ధమయ్యాడు. ధమాకా విజయం తరువాత త్రినాధ రావు నక్కిన తర్కెక్కించిన చిత్రం ఇదే. ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 21వ తారీఖున గ్రాండ్గా విడుదల కానుంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో వేచి ఉండాల్సిందే. 

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు మంచు మనోజ్ అలాగే నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన భైరవం సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 28వ తారీఖున విడుదల కానుంది. అంతేకాకుండా ఫిబ్రవరి ఆఖరి వారంలో ఆది పిన్ని శెట్టి శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

ఇక లవ్ టుడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గర అయిన ప్రదీప్ రంగనాథ్ , అనుపమ పరమేశ్వరం ప్రధానోపాత్రలో నటిస్తున్న డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ సినిమా రొమాంటిక్ మరియు కామెడీ నేపథ్యంలో రూపొందుతుంది.