తొలి తరం మూకీ సినిమా

Anekam

తొలినాళ్లలో  ప్రపంచం వ్యాప్తంగా ఎలాంటి మాటలు, శబ్దాలు లేని మూకీ చిత్రలే  నిర్మితమయ్యాయి.  అప్పటికి సౌండ్  రికార్డింగ్ టెక్నాలజీ కనుక్కోలేదు. శబ్దాల రికార్డింగ్,రీరికార్డింగ్ లేకపోవడంతో  తెరపై పాత్రలు నిశబ్దంగా కదిలేవి. సన్నివేశాన్ని   చూస్తూ ప్రేక్షకుడు కథ అర్ధం చేసుకునేవాడు.

 #ఫ్రెంచ్ సోదరులైన ల్యుమియార్  బ్రదర్స్ ప్రపంచ తొలి సినీ నిర్మాణ కర్తలు. వారు నిర్మించిన మొట్టమొదటి మూకీ  చిత్రం ..”లీవింగ్ ది ఫ్యాక్టరీ”  1896 ఫిబ్రవరి  21 న లండన్ లో ప్రదర్శించబడింది. 

#మూవీ కెమెరాను  ఇంగ్లాండ్ వాసి  ఫ్రీజ్ గ్రీన్, మూవీ ప్రొజెక్టర్ ను థామస్ ఆల్వా ఎడిసవ్ కనిపెట్టారు. ఫ్రాన్స్ కి చెందిన ల్యుమియార్ బ్రదర్స్  ప్రపంచపు తొలి చిత్రం నిర్మించారు. 

#విచిత్రం ఏమిటంటే ఇంగ్లాండ్ లో పుట్టి, ఫ్రాన్స్ లో ఎదిగిన ప్రపంచపు సినిమా అమెరికా లో  అభివృద్ధి చెందింది. నేడు హాలీవుడ్ కేంద్రం గా భారీ బడ్జెట్ తో ప్రపంచ వ్యాప్తంగా  ప్రదర్శించబడే  సినిమాలు  నిర్మితమవుతున్నాయి.

# మన దేశపు  లో తొలి చలన చిత్ర నిర్మాత హరిశ్చంద్రా  భట్ వాడేకర్.  ఈయన 1899 లో బొంబాయి లో  రెండు మూకీ చిత్రాలు నిర్మించాడు.

# దక్షిణ భారతదేశపు మొదటి మూకీ చిత్రం “కీచక వధ. దీన్ని  ఆర్ ఎం మొదిలీయర్ 1916 లో  నిర్మించాడు.

#  తెలుగులో మొట్టమొదటి మూకీ చిత్రం “భీష్మ ప్రతిజ్ఞ ” . దీన్ని 1922 లో రఘుపతి వెంకయ్య నాయుడు నిర్మించాడు. తన కుమారుడు ఆర్ ఎస్ ప్రకాష్  దర్శకత్వంలో ఆయనే కథానాయకుడు గా ఈ చిత్రం తీసారు.

 #  1926 లో  సి పుల్లయ్య కాకినాడ పరిసరాల్లో “భక్త మార్కండేయ”  చిత్రాన్ని నిర్మించాడు.  విశేషమేమిటంటే  ఈ చిత్ర ప్రదర్శన నాడు  వెండి తెర పై కాకుండా తెల్లటి ఇంటి గోడలపై  జరిగేది.  అందుకే ఆ రోజుల్లో సినిమా ను “గోడ మీద బొమ్మ “గా పిలిచేవారు.

#  ఇక ఆధునిక టాకీ యుగం లో వచ్చిన మూకీ చిత్రం…”పుష్పక విమానం”.  సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్,  అమల నటించిన ఈ చిత్రం  27 నవంబర్ 1987  రిలీజ్ అయింది.

#  “పుష్పక విమానం” పూర్తిగా సంభాషణలు లేని చిత్రమే కానీ శబ్దాలు  మాత్రం వినిపిస్తుంటాయి.   దీన్ని సగం మూకీ, సగం టాకీ  చిత్రం గా అభివర్ణించవచ్చు.     

 – సూదా శివరామకృష్ణ

LOOKING DIGITAL MARKETING SERVICE TO YOUR BUSINESS?