మహేష్ – రాజమౌళి మూవీ షూటింగ్ వీడియో లీక్ !

Cinema

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘SSMB29’. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని క్లిప్స్ లీక్ అయినట్లు తెలుస్తుంది.  పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం బెంగళూరు అడవుల్లో  షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఫోన్లో రికార్డ్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్లిప్ లో  సూపర్ స్టార్ మహేష్ బాబు నడుచుకుంటూ వెళుతుంటే.. విలన్ అతన్ని కొట్టడం.. మహేష్ మోకాలుపై కూర్చోవడం వంటి సీన్లు కనిపించాయి. అంతేకాదు ఈ వీడియోలో కన్నడ హీరో పృథ్విరాజ్ దర్శనం ఇవ్వడంతో సంచలనంగా మారింది. పృథ్వీరాజ్ ఓ వీల్ చైర్ లో కూర్చుని ఉన్నట్లు కనిపిస్తారు. ఇక ఈ హైలెట్ సీన్ లీక్ అవడంతో  మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తెగ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా… ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది బిగ్ స్టార్ నటులు  నటిస్తున్నారు.  ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీలకపాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక మెయిన్ హీరోయిన్ గా   ఇండోనేషియన్  బ్యూటీ అయినటువంటి చెల్సియా ఇస్లన్  నటిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ టాక్  వినిపిస్తోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టారని విజయేంద్ర ప్రసాద్  ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఇంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాని  ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో కొన్ని సీన్లను అప్లోడ్ చేయడం పట్ల చిత్ర బృందం కూడా అసహనం వ్యక్తం చేస్తుంది. కాగా ఈ సినిమా దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ తో  చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.