అప్పుల ఉచ్చులో నుంచి బయటపడ్డ కళ్యాణ్ రామ్… నిర్మాతగా నిలిచాడా..?….జూనియర్ ఎన్టీఆర్ అన్నగా కళ్యాణ్ రామ్ మనందరికీ తెలుసు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అటు సినిమాల్లోని నటిస్తూ అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. దాదాపుగా చాలా సినిమాలకి నిర్మాతగా కూడా పనిచేశాడు. అయితే కళ్యాణ్ రామ్ కి చాలా సినిమాలు నిర్మాతగా వ్యవహరించి భారీ నష్టాలను మూట కట్టుకున్నాడు. ఇజం,కత్తి, విజయీభవ, ఓం త్రి డి సినిమాలలో నటిస్తూనే సొంత బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమాలన్నీ కూడా భారీ ఫ్లాప్స్ అవడంతో కళ్యాణ్ రామ్ కి విపరీతంగా నష్టం కలిగింది. అయితే ఇక ఆ టైంలో నిర్మాతగా ఉండి కూడా వేస్ట్ అని చెప్పి సైడ్ అయిపోదామని డిసైడ్ అయ్యాడట కళ్యాణ్ రామ్. అయితే ఆ వెంటనే ఎన్టీఆర్ నటించినటువంటి జై లవకుశ సినిమాకి నిర్మాతక వ్యవహరించి అప్పుల ఊబిలో నుంచి బయటపడ్డాడు. అయితే తన తమ్ముడి వల్లే ఆ సినిమాలో నిర్మాతగా వ్యవహరించి మంచి లాభాలను తెచ్చి పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. దానికి కారణం కచ్చితంగా ఎన్టీఆర్. అయితే మరోసారి బింబిసార సినిమాతో తానే నిర్మాతగా ఉండి సినిమా చేశాడు. ఆ సినిమాకి పెట్టుబడికి డబల్ రూపంలో డబ్బు అనేది వచ్చింది. దాంతో ఇక నిర్మాతగా మళ్లీ సక్సెస్ అయ్యాడు కళ్యాణ్ రామ్. అయితే ఈ మధ్య వచ్చినటువంటి దేవరా సినిమాతో రెండోసారి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కి జీవితం ఇచ్చాడంటే అందులో డౌటే లేదు. దేవర సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అందుకున్నాడు. వారం కిందట రిలీజ్ అయిన దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. వచ్చేవారం కూడా దసరా సెలవులు కావడంతో వసూలు అనేవి ఇంకా పెరగవచ్చు. కాబట్టి కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక దేవర 2 కూడా కళ్యాణ్ రామే ప్రొడ్యూసర్ గా ఉండేటువంటి అవకాశం ఉండడంతో అందులో కూడా భారీగా డబ్బుని సంపాదించుకునే అవకాశం ఉంది. దీంతో కళ్యాణ్ రామ్ నిర్మాతగా టాలీవుడ్ లో మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నాడు.