కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఇన్ని నేరాలు చేశాడా?

అవీ ఇవీ

కొరియోగ్రాఫర్ పై వేధింపులు…. గతంలోనూ జానీ మాస్టర్ ఇన్ని నేరాలు చేశాడా… నిజం ఎంత? తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ మాస్టర్. ఇతనికి డ్యాన్స్లలో పలు అవార్డులు కూడా వచ్చాయి. మనిషి చూడడానికి చాలా అందంగా అలాగే స్టైల్ గా కూడా ఉంటాడు. అయితే తన మనసు మాత్రం మంచిది కాదని పలుమార్లు బయటపడుతుంది. తాజాగా ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగికంగా వేధింపులకు గురి చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ మహిళా కొరియోగ్రాఫర్ ఉంటున్న నివాసంలోనే కాకుండా చెన్నై, ముంబై అలాగే హైదరాబాదులో కూడా అవుట్డోర్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోను అనేకసార్లు నాపై లైంగిక దాడి చేశాడని ఆ మహిళ కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆ మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగి నివాసం కి చెందిన పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్ ) అలాగే క్రిమినల్ బెదిరింపు కింద (506) అలాగే గాయపరచడం వల్ల పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Find Astrology ServicesFind MatrimonyBuy Best Properties

అయితే జానీ మాస్టర్ పై ఇంతకుముందే పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. గతంలో జానీ మాస్టర్ అనేక లైంగిక దాడుల ఆరోపణలు చాలానే ఎదుర్కొన్నాడు. 2015 సంవత్సరంలో జరిగినటువంటి ఒక మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్ కు దాదాపుగా ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించింది. అయితే తర్వాత బయటికి వచ్చి తను కొరియోగ్రాఫర్ గా ఎన్నో పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నాడు. తర్వాతి తర్వాతి కాలంలో మెల్లగా ఎదుగుతూ 2024లో రాజకీయపరంగా జనసేన పార్టీలో చేరి పలు కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఏదైనా సరే ఇటువంటి మనిషి లైంగిక దాడులలో పాల్గొనడంపై అతని ఫ్యాన్స్ అలాగే సినీవర్గాలు అతనిపై ద్వేషంగా ఉన్నారు.