Camera Story

Anekam

కెమేరా కథ…సినీ సాంకేతికత లో కెమేరాది ప్రధమ స్థానం. కన్నుతో చూడ లేని దాన్ని కెమేరా కన్ను తో చూడొచ్చని నానుడి. కెమేరా, నటీ నటుల సూక్ష్మ హావ భావాలను కూడా వెండి తెరపై అందంగా చూపిస్తుంది…..వారు వెండితెర స్టార్లగా ఎదిగేందుకు దోహద పడుతుంది.    

#  వస్తువుల కదలికలను కెమెరాతో చిత్రీకరించవచ్చని మొదటిగా గుర్తించిన వాడు…ఫ్రీజ్ గ్రీన్. ఇంగ్లాండ్ కు చెందిన అతడు వేగంగా ఫోటోలు తీసే కెమెరాను కనుగొన్నాడు.

#  కెమెరాలో  సెకెనుకి 24 ఫ్రేమ్ లు కదిలితే బొమ్మలు సహజంగా కదులుతాయి. అంతకన్నా తక్కువ ఫ్రేమ్లతో చిత్రీకరిస్తే బొమ్మలు ఎక్కువ వేగంగా,  ఎక్కువ  ఫ్రేమ్లతో చిత్రీకరిస్తే  తక్కువ కదులుతాయి. చార్లీ చాప్లిన్ సినిమాలు సెకెనుకి 18 ఫ్రేమ్లతో చిత్రీకరించబట్టే వాటిలోని పాత్రలు వేగంగా కదులుతూ కనిపిస్తాయి. # 1891లో థామస్ఆల్వా ఎడిసన్ సినీ రీళ్లను ప్రదర్శించే ప్రొజెక్టర్ ను కనుగొన్నాడు.

#  1895 లో వుడ్విల్లాడం, లద్ధంలోప్ లు ఫిలిం రీళ్లను ఆపకుండా ప్రదర్శించే టెక్నాలజీ ని కనుగొన్నారు.

#  1894-95 లో ఫ్రాన్స్ కి చెందిన ల్యూమీయర్     బ్రదర్ మొట్టమొదటి సారిగా చలన చిత్రాన్ని నిర్మించారు.”లీవింగ్ ది ఫ్యాక్టరీ” అనే చిత్రాన్ని తీసి 1896 ఫిబ్రవరి 21 న లండన్లో ప్రదర్శించారు.

#  సినిమా అనేది నాడు కేవలం ధనవంతులకే సంబంధించిన

ఖరీదయిన వినోద కళ. సినిమా నిర్మాణ వ్యయం అధికంగా వుండేది.ధనవంతులకే ప్రదర్శించి అధికంగా డబ్బులు వసూలు చేసేవారు.

#  కెమెరా కాలక్రమం లో వివిధ వర్ణాలను వెండితెర పై నయనా నందకరంగా ప్రదర్శించింది. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, గేవా, ఈస్టమన్, ఫుజి అనే రకరకాల కంపెనీల రంగుల చిత్రాల నిర్మాణాలు జరుపుకున్నాయి.

#   వెండితెర కి స్కోప్, 70 ఎంఎం, డిజిటల్, డాల్బీ, అల్ట్రా సౌండ్ సిస్టంతో అదనంగా గ్రాఫిక్స్ కూడా అదనంగా చేరాయి.      

FIND BEST PROPERTIES