విలక్షణ విలనిజం…రావు గోపాలరావు. ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన ‘కీర్తిశేషులు’ నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.
జననం – వివాహం
కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో జనవరి 14, 1937లో జన్మించారు. ప్రముఖ హరికథ కళాకారిణి అయిన రావు కమలకుమారితో 1966, జనవరి 16న రావుగాపాలరావు వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారు.[1] ఈమె 73 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 6, 2018 న హైదరాబాదులో మరణించింది.
నట జీవితము
రావు గోపాలరావు నాటకాలను చూసి ఎస్.వి.రంగారావు మెచ్చుకుంటూ గుత్తా రామినీడుకి పరిచయం చేస్తే ‘భక్తపోతన’ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. ‘బంగారు సంకెళ్లు, మూగప్రేమ’ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసి, ‘జగత్ కిలాడీలు’ చిత్రంలో నటించి విలన్ అనిపించుకున్నారు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు నిర్మాతలు. బాపు దర్శకత్వంలో రూపొందిన భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్, చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్ గుర్తిండిపోతాయి. అలా గుర్తుండి పోయే డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు.
రావు గోపాలరావు అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో ఒన్స్ మోర్ లు … వెండితెరపై సైతం ఆయన నటనావిన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పిపుట్టేలా చప్పట్లు కొట్టించాయి… ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి… వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు… రావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికారు… అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమయింది… కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలూ ఉన్నాయి… బాపు-రమణ ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావును నటింప చేశారు… రావు గోపాలరావు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు… తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు నిజజీవితంలో ఎంతో సౌమ్యులు… రావు గోపాలరావు రాజ్యసభ సభ్యునిగానూ ఉన్నారు… ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావు గోపాలరావు నటవారసునిగా రావు రమేశ్ ఈ తరం వారిని తనదైన నటనతో అలరిస్తున్నారు… తెలుగు ప్రతినాయకుల్లో నటవిరాట్ గా జనం మదిలో నిలచిపోయారు రావు గోపాలరావు… ఆయన స్థానం వేరెవ్వరూ భర్తీ చేయలేనిది అనడం అతిశయోక్తి కాదు…
పురస్కారములు
ఇతనికి 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది.
వ్యక్తిగత జీవితము
ఈయన కుమారుని పేరు రావు రమేశ్. ఇతను కూడా మంచి నటుడుగా పేరు తెఛ్ఛుకున్నాడు. మగధీర, కొత్త బంగారు లోకం, గమ్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు.
ప్రజాదారణ పొందిన సంభాషణలు సవరించు
ముత్యాల ముగ్గు సినిమాలో : సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ…. ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోస నుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?
మరణం సవరించు
1994, ఆగష్టు 13 న దివంగతులయ్యారు.
నటించిన చిత్రాల జాబితా
భక్త పోతన (1966)
బంగారు పంజరం (1968)
జగత్ కిలాడీలు (1969)
రివాల్వర్ రాణి (1971)
కాలం మారింది (1972)
బీదలపాట్లు (1972)
ఇదా లోకం (1973)
నేరము – శిక్ష (1973)
శారద (1973)
అల్లూరి సీతారామరాజు (1974) – వీరయ్యదొర
కృష్ణవేణి (1974)
గౌరి (1974)
తులసి (1974)
బంట్రోతు భార్య (1974)
అన్నదమ్ముల కథ (1975)
ఆస్తికోసం (1975)
జేబు దొంగ (1975)
నాకూ స్వతంత్రం వచ్చింది (1975)
ముత్యాలముగ్గు (1975) – కాంట్రాక్టరు
జ్యోతి (1976)
పెద్దన్నయ్య (1976)
మనిషి రోడ్డున పడ్డాడు (1976)
బంగారు మనిషి (1976)
భక్త కన్నప్ప (1975)
యవ్వనం కాటేసింది (1976)
ఆత్మీయుడు (1977)
ఆమె కథ (1977)
జరుగుతున్న కథ (1977)
పల్లెసీమ (1977)
భలే అల్లుడు (1977)
మా ఇద్దరి కథ (1977)
మొరటోడు (1977)
స్నేహం (1977)
అతని కంటే ఘనుడు (1978)
అనుగ్రహం (1978)
కటకటాల రుద్రయ్య (1978)
కరుణామయుడు (1978)
జగత్ కిలాడీలు (1978)
ప్రాణం ఖరీదు (1978) – కనకయ్య
మన ఊరి పాండవులు (1978)
మల్లెపువ్వు (1978)
యుగపురుషుడు (1978) – బలరాం
మా ఊళ్ళో మహాశివుడు (1979)
వియ్యాలవారి కయ్యాలు (1979)
కలియుగ రావణాసురుడు (1980)
గోపాలరావు గారి అమ్మాయి (1980)
చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
నాయకుడు – వినాయకుడు (1980)
నిప్పులాంటి నిజం (1980)
పగడాల పడవ (1980)
పసుపు పారాణి (1980)
బండోడు గుండమ్మ (1980)
బెబ్బులి (1980)
రౌడీ రాముడు (1980)
సర్కస్ రాముడు (1980)
కిరాయి రౌడీలు (1981) – బాబూరావు
ఊరికి మొనగాడు (1981)
త్యాగయ్య (1981) – జపేశం
నా మొగుడు బ్రహ్మచారి (1981)
ప్రేమ కానుక (1981)
కృష్ణార్జునులు (1982)
జస్టిస్ చౌదరి (1982)
దేవత (1982)
ప్రేమ నక్షత్రం (1982)
ప్రేమ మూర్తులు (1982)
బంగారు భూమి (1982)
బొబ్బిలి పులి (1982)
మీసం కోసం (1982)
షంషేర్ శంకర్ (1982)
అగ్నిసమాధి (1983)
అడవి సింహాలు (1983)
అభిలాష (1983)
కిరాయి కోటిగాడు (1983)
ఖైదీ (1983) – వీరభద్రయ్య
గూఢచారి నెం.1 (1983) – గోవిందరావు
చండశాసనుడు (1983)
చట్టానికి వేయికళ్లు (1983) – కె.డి.స్వామి
ఇద్దరు దొంగలు (1984)
నాగు (1984)
బాబులుగాడి దెబ్బ (1984)
బొబ్బిలి బ్రహ్మన్న (1984) – మీసాల పెదవెంకట్రాయుడు
కొంగుముడి (1985)
దేవాలయం (1985)
అపూర్వ సహోదరులు (1986)
కలియుగ కృష్ణుడు (1986)
కొండవీటి రాజా (1986)
దేశోద్ధారకుడు (1986)
మగధీరుడు (1986)
దొంగ రాముడు (1988)
అత్తకి యముడు అమ్మాయికి మొగుడు (1989)
ఆ ఒక్కటీ అడక్కు (1992) – రొయ్యలనాయుడు
ఘరానా మొగుడు (1992)
అల్లరి అల్లుడు (1993)
అల్లరి ప్రియుడు (1993).
మంచి పెళ్లి సంభందం కావాలా? మీకు దగ్గరలో మాట్రిమోనీ సర్వీస్ ని ఎంచుకోండి