శ్రీదేవి మరణం – వివాదాలు

అవీ ఇవీ

అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి దాదాపు ఆరు సంవత్సరాలైనా ఆమె మృతి పై ఇప్పటికీ అనుమానాలు వస్తూనే ఉన్నాయి. దుబాయ్ లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ అనే హోటల్లో లోని బాత్ పడి శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ మరణం వెనకాల పెద్ద మిస్టరీని నడిచింది. మొదటగా శ్రీదేవి గుండెపోటు చనిపోయినట్లు పలు రకాలుగా వార్తలనేవి వచ్చేవి. కొన్ని రోజులు వెంటనే గుండెపోటుతో కాదు… స్పృహ కోల్పోవడం వల్ల చనిపోయిందని మరికొందరు అంచనా వేశారు.. ఇలా ఎవరికి వారు ఒక కోణంలో ఒక్కో విధంగా చనిపోయిందని చెప్పి చాలా కథనాలు రాసుకోచ్చారు. అయితే అప్పట్లో దుబాయ్ పోలీసులు పలుకోనాల్లో ఎంక్వయిరీలు చేసి ప్రమాదవశాత్తునే హోటల్లోని బాత్ టబ్లో పడి చనిపోయిందని దీని వెనుక ఎలాంటి కక్ష పూరితమైన లేక నేరపూరిత కారణాలు కనపడలేదని దుబాయ్ పోలీసులు తేల్చేశారు. పెళ్లి సంబంధం చూస్తున్నారా..మీ కమ్యూనిటీ నుండి తగిన మ్యాచ్ ని పొందండి అయితే శ్రీదేవి మృతి వెనుక చాలా వ్యాఖ్యలు చాలానే వచ్చాయి. అయితే మన ఢిల్లీకి చెందిన వేద భూషణ్ అనే మాజీ అసిస్టెంట్ కమిషనర్ అప్పట్లో శ్రీదేవి మృతి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిని పక్క ప్లాన్ ప్రకారం హత్య చేశారని అప్పట్లో ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఎవరినైనా సరే ఈజీగా బాత్ టబ్లో చాలా సులువు అని అలాగే మునిగి చనిపోయాడని చెప్తే ఎవరైనా నమ్మేస్తారని చెప్పి తప్పించుకునే వాళ్లు కూడా ఉన్నారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ డాక్టర్లు ఇచ్చిన ఫారెన్సీక్ నివేదికపై కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశాడు. అప్పట్లో ఈ కేసు వెనకాల చాలా విషయాలు ఉన్నాయని అవి కచ్చితంగా తెలుసుకోవాలని అన్నారు. అయితే ఏసీపీగా రిటైర్డ్ అయిన ఆయన ప్రస్తుతం ప్రైవేట్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ని నడుపుతూ ఉంటూనే దుబాయ్ లో ఉన్న శ్రీదేవి హోటల్ గదిలోకి కూడా వెళ్లడానికి ప్రయత్నించాడు కానీ దుబాయ్ పోలీసు సిబ్బంది అతన్ని అడ్డుకుంది. అయితే ఇలా ఒక్కడు కాదు ఇద్దరు కాదు అప్పట్లో శ్రీదేవి మరణం పై సందేహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఇలా అప్పట్లో శ్రీదేవి మరణం వెనకాల చాలా సందేహాలు నడిచాయి. శ్రీదేవి మరణం అనేది అప్పట్లో ఉన్నాభారతీయులకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

contact best astrology services