డబ్బింగ్ ఆర్టిస్ట్ :- డబ్బింగ్ అంటే గొంతు అరువ్వివటం.. డైలాగ్ చెప్పలేని , పాటలు పాడలేని నటులకు, డబ్బింగ్ కళాకారులు వారి తరుపున మాటలు చెప్తారు, పాటలు పాడతారు. గాయనీ గాయకులు కూడా డబ్బింగ్ ఆర్టిస్టుల పరిధి లోకి వస్తారు. షూటింగ్ అంతా పూర్తయ్యాక డబ్బింగ్ స్టూడియోలో ఈ ప్రక్రియ జరుగుతుంది.. గాయనీ గాయకులుగా ఘంటసాల, సుశీల, జానకి, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ; డబ్బింగ్ కళాకారులుగా రోజా రమణి, చిన్మయి ప్రసిద్ధులు. ఎస్పీ శైలజ, సునీత, మనో లు పాటలు పాడుతారు, డబ్బింగ్ చెప్తారు.
వాస్తు సేవలయు కోసం చూస్తున్నారా…. CLICK
సినీ డ్రైవర్లు :- వీరు షూటింగ్ జరిగేటప్పుడు అందరికంటే ముందు నిద్ర లేస్తారు. రాత్రి అందరి కంటే చివరిగా నిద్ర పోతారు. ప్రొడక్షన్ మేనేజర్ ఇచ్చిన జాబితా ప్రకారం ఆయా నటీనటులు , టెక్నిషియన్లను కార్లలో లొకేషన్లకు తీసుకు రావటం వీరి ప్రధాన విధి. షూటింగ్ అయ్యాక వారు బస వుండే ప్రాంతాల్లో డ్రాప్ చేస్తారు. వీరు రావటం లేట్ అయితే షూటింగ్ కూడా లేట్ అవుతుంది. సినిమా డ్రైవర్లు సెట్ ప్రాపర్టీస్ తీసుకు రావటంలో, భోజనాలను షూటింగ్ జరిగే ప్రాంతంకు తేవటం లో సహాయ పడతారు. అలాగే అవుట్ డోర్ లొకేషన్ కి జనరేటర్ ఇతర ఎక్విప్ మెంట్లు తెస్తారు.
పెళ్లి సంబంధం చూస్తున్నారా… martimony సేవలు కోసం CLICK
ప్రొడక్షన్ కార్మికులు :- ఈ విభాగం లో అందరు మహిళలే వుంటారు. వీళ్లు ప్రొడక్షన్ అసిస్టెంట్ లు చెప్పే పనులు చేస్తారు. షూటింగ్ స్పాట్ ను శుభ్ర పరచటం, భోజనాల పాత్రలు కడగటం సాధారణంగా వీరు చేసే పనులు. షూటింగ్ మంచు కొండల్లో జరిగినా, అడవుల్లో జరిగినా వీరు తప్పనిసరి.
రియల్ ఎస్టేట్ సమాచారం కోసం CLICK
స్క్రిప్ట్ రైటింగ్ :- ఈ కోవ లోకి సినీ రచయతలు వస్తారు. స్క్రిప్టే ఏ చిత్రానికైనా నిజమైన హీరో. ఒక సినిమా ప్రాజెక్ట్ కి నాంది ఈ స్క్రిప్ట్ రైటింగ్. దీనిలో స్టోరీ ( కథ ), డైలాగ్ ( సంభాషణలు ), స్క్రీన్ ప్లే ( చిత్రానువాదం ) లు ఇమిడి ఉంటాయి. పాటలు కూడా స్క్రిప్ట్ రైటింగ్ కిందకే వస్తాయి. ఏ చిత్రానికైనా మంచి కథే ప్రాణం. మంచి కథ లేకుండా ఎన్ని హంగు ఆర్భాటాలతో తీసినా ఆ చిత్రం పరాజయం పొందుతుంది. కథా రచయిత మనుసులో ముందుగా ఒక కథ పుడుతుంది. కథా విస్తరణ సమయంలో దర్శకుడి సమక్షంలో కొన్ని మార్పులు చేర్పులతో తుది స్క్రిప్ట్ సిద్ధం అవుతుంది. తెలుగులో పరుచూరి బ్రదర్స్ ( ఈనాడు , ఖైదీ , లారీ డ్రైవర్ , ఒక్కడు ) విజయేంద్ర ప్రసాద్ ( విక్రమార్కుడు , మగధీర , బాహుబలి ) త్రివిక్రమ్ శ్రీనివాస్ ( అతడు , జల్సా ) కోన వెంకట్ ( దూకుడు , హ్యాపీ , ఢీ ) అబ్బూరి రవి ( ఎవడు డాన్ ) చంద్ర బోస్ , భాస్కర భట్ల , భువన చంద్ర తదితరులు సినీ రచయితులుగా వున్నారు.
OVERSEAS / ABROAD EDUCATION SERVICES – CLICK
సంగీతం :- సంగీతం చిత్రానికి గుండె లాంటిది. సంగీత దర్శకుడి ఆధ్వర్యం లోని వాయుధ్య కారులు పాటలకు , చిత్ర నేపధ్యానికి సంగీతం అందిస్తారు. చిత్ర కథ , దర్శకుడి అభిరుచికి అనుగుణంగా ఈ మ్యూజిక్ అందిస్తారు. ఈ సంగీతం వల్లే సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడు రసానుభూతికి లోనవుతాడు. పాటలు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సూపర్ హిట్ అయిన చిత్రాలు గతం లో చాలా వున్నాయి. కె చక్రవర్తి ( వేటగాడు, దేవత , ఖైదీ ) మణిశర్మ ( చూడాలని వుంది , టెంపర్ , మురారి ) బప్పిల హరి ( సింహాసనం , స్టేట్ రౌడీ ) దేవిశ్రీ ప్రసాద్ ( గబ్బర్ సింగ్ , జులాయి , సరిలేరు నీకెవ్వరూ ) అనూప్ రూబెన్స్ ( మనం , హార్ట్ ఎటాక్ , నేనే రాజు నేనే మంత్రి ) లు తెలుగులో కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు.