బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి ఆలియా భట్ రెండవసారి తల్లి కాబోతుంది. బాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియాభట్ ఇద్దరు కూడా రెండవ బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇప్పటికే వీరిద్దరికీ ‘ రహ’ అనే పాప జన్మించగా.. ప్రస్తుతం రెండవ బిడ్డ కోసం ఆరాటపడుతున్నారట. అయితే ఈ విషయాన్ని ఆలియా భట్ నేరుగా తెలియజేయకపోయినా ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను బట్టి తెలిసిపోయింది. కూతురు రహా అని పేరు ఎందుకు పెట్టారో వివరిస్తూ తన నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు కూడా ఒక పేరును నిర్ణయించుకున్నట్లుగా ఆలియా భట్ తెలిపారు. కానీ ఈ ఇంటర్వ్యూలో రెండో బిడ్డ పేరు మాత్రం వెల్లడించలేదు. కాగా ఆలియా భట్ మొదటి ప్రెగ్నెన్సీలో అబ్బాయి పుడితే ఒక పేరు అలాగే అమ్మాయి పుడితే మరో పేరు పెట్టాలని ముందుగానే డిసైడ్ చేసుకున్నారట. అలా మొదటగా అమ్మాయి పుట్టడంతో రహ అని పెట్టినట్లు తెలిపింది. ఇక ఇంకో పేరును నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. కానీ ఎంతసేపటికి ఆ పేరు మాత్రం బయటకు చెప్పలేదు. అయితే తమకు ఇప్పటికే పాప ఉండడంతో నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ అబ్బాయి అయితే బాగుండు అని ఆలియా భట్ ఇంటర్వ్యూలో భాగంగా హింట్ ఇచ్చారు. అంతేకాకుండా మొదట పుట్టిన పాప పేరు రహా అని తన అత్తగారు నీతు కపూర్ సలహా ఇచ్చినట్లుగా తెలిపింది. ఇక అలియా భట్ మరియు రణబీర్ కపూర్ 2022లో 4 సంవత్సరాల డేటింగ్ తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ తరువాత పెళ్లయిన సంవత్సరం తరువాత రహ అనే పాప జన్మించింది. తరువాత సినిమాలతో బాగా బిజీగా ఉన్న సందర్భంలో వీరిద్దరూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళ వ్యక్తిగత విషయాలను చెబుతున్నారు. ఇక వీరిద్దరి పాప రహా కూడా అప్పుడప్పుడు ఎయిర్పోర్టులలో లేదా పలుచోట్ల కనిపిస్తూ అభిమానులకు హాయ్ చెబుతూ తెగ సందడి చేస్తూ ఉంటుంది.
పెళ్లి సంబంధం చూస్తున్నారా? మంచి మాట్రిమోనీ మీడియేటర్ కోసం CLICK