వర్మకు షాక్

Anekam

ప్రతిరోజు తన మాటలతో సోషల్ మీడియాలో నిలిచేటువంటి రాంగోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. సంచలనాలు సృష్టించేటటువంటి దర్శకుడు రాంగోపాల్ వర్మ కు మూడు నెలల పాటు జైలు శిక్ష విధించినట్లు న్యాయస్థానం తెలిపింది. ఇక ఈ మధ్యనే నా గతం అంతా వినాశనమే అని నేను ఇప్పుడు మారిపోయాను అంటూ చెప్తూనే భారీ బడ్జెట్ తో ఓ సినిమా చేస్తున్నానంటూ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ నోటితో చెప్పినంత మాత్రాన వెనుక ఉన్నటువంటి తప్పులు చెరిగిపోని మరోసారి రుజువు చేశారు. దాదాపుగా ఏడేళ్ల క్రితం చెక్ బౌన్స్ కేసులో వర్మపై మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి కేసు వేయడం జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం న్యాయస్థానం రాంగోపాల్ వర్మ కు బిగ్ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా కోర్టులో ఈ కేసు నడుస్తూ ఉండగా పలిమార్లు కోర్టుకు విచారణకు రమ్మని రాంగోపాల్ వర్మ కి చెప్పినా రాకపోవడంతో కోర్టు ఆగ్రహానికి గురై సెక్షన్ 138 ప్రకారం మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా మూడు లక్షల 72 వేల రూపాయలు జరిమానా కట్టాలని అంధేరి కోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ఈ మూడు లక్షల రూపాయలు కట్టని పక్షాన మరో మూడు నెలల పాటు జైలు శిక్ష విధిస్తామని కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఇప్పుడిప్పుడే మారుతున్న అంటూ చెప్పుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ కు ప్రారంభంలోనే భారీ షాక్ తగలడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

BEST MATRIMONY SERVICES FOR TELUGU PEOPLE

FIND GOOD HEALTH GUIDANCE THROUGH EXPERT DOCTORS